Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అవ‌సర‌మా.. అంత మాట అనేశాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అవ‌సర‌మా.. అంత మాట అనేశాడేంటి?

 Authored By ramu | The Telugu News | Updated on :16 February 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అవ‌సర‌మా.. అంత మాట అనేశాడేంటి?

Pawan Kalyan : ఇటీవల పవన్ కళ్యాణ్ Pawan Kalyan దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. అలానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత మంది ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు Pawan Kalyan దేవదాయ శాఖ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ CPI Ramakrishna సూచించారు.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అవ‌సర‌మా అంత మాట అనేశాడేంటి

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అవ‌సర‌మా.. అంత మాట అనేశాడేంటి?

Pawan Kalyan విమ‌ర్శ‌ల ప‌ర్వం..

‘ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్‌.. కాషాయ గుడ్డలు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా? కేబినెట్‌లో ఉన్న ఆయన ప్రశ్నించకుండా మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం ఏమిటి’ అని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి, గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు. కూటమికి ప్రజలు 164 సీట్లను కట్టబెడితే.. మాట్లాడకుండా అదానీకి ఊడిగం చేస్తున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది