Ys Jagan : వైఎస్ జగన్‌పై దాడి టీడీపీ పనే… నారా లోకేష్ వ్యాఖ్యలే సాక్ష్యం..!
Ys Jagan : ఏపీలో రాజకీయాలు మాటల దాడి నుంచి రాళ్ల దాడి వరకు చేరుకున్నాయి. ఇన్ని రోజులు కేవలం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు రాళ్ల దాడి వరకు చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ బస్సుయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నాటికి బస్సు యాత్రకు 14 రోజులు అవుతోంది. అయితే శనివారం రాత్రి జగన్ విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అదే అదునుగా కొందరు దుండగులు జగన్ మీద రాళ్లతో దాడి చేశారు. ఓ రాయి వచ్చి జగన్ కుడి కనుబొమ్మ మీద తాకింది.
Ys Jagan : స్పందించిన మోడీ..
దాంతో తీవ్రంగా గాయం అయింది. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది జగన్ మీద రాళ్లు పడకుండా అడ్డుగా ఉన్నారు. ఆ వెంటనే బస్సును లోపలికి తీసుకెళ్లి వైద్యులతో శస్త్ర చికిత్స అందించారు. అయితే ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా వైసీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ దాడి చేశారంటూ మండిపడ్డారు. నారా లోకేష్ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని అర్థం అవుతోంది. జగన్ పై జరిగిన దాడి టీడీపీ పనే అంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి. నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. దాన్ని బట్టి చూస్తుంటే దాడి వెనకాల టీడీపీ హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. ఎవరైనా కావాలని దూరం నుంచి రాయితో దాడి చేయించుకుంటారా.. కావాలంటే నారా లోకేష్ ను అదే బస్సుపై అక్కడే నిలబెడుదాం.
కావాలంటే ఆయన్ను కొట్టించుకోమనండి.. అప్పుడు ప్లాన్ చేసి కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో అర్థం అవుతుంది అని పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రికి గాయం అయితే నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు పాదయాత్రకు వచ్చినంత ఆదరణ ఇప్పుడు బస్సుయాత్రకు వస్తోంది కాబట్టే దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాడు అంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.