Rental Bride : 40 వేలకే అమ్మాయిలని భార్యలు చేసుకోవచ్చు.. వద్దు అంటే వదిలేయవచ్చు..!
ప్రధానాంశాలు:
Rental Bride : 40 వేలకే అమ్మాయిలని భార్యలు చేసుకోవచ్చు.. వద్దు అంటే వదిలేయవచ్చు..!
Rental Bride : ఇండోనేషియాలోని పుంకాక్ పశ్చిమ ప్రాంతంలో విచిత్ర ధోరణి కనిపిస్తుంది. అక్కడికి మధ్యప్రాచ్యం నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. వారు స్వల్పకాలిక వివాహాలపై ఆసక్తి చూపుతారు.ఇండోనేషియాలోని కోటా బుంగా అనే కొండ రిసార్ట్‌ను సందర్శించే పర్యాటకులను ఒక అధికారిక ఏజెన్సీ గ్రామీణ మహిళలకు పరిచయం చేస్తుంది. డబ్బు లావాదేవీపై చర్చల తర్వాత ఇద్దరి మధ్య ఒక చిన్న అనధికారిక వివాహం జరుగుతుంది.

Rental Bride : 40 వేలకే అమ్మాయిలని భార్యలు చేసుకోవచ్చు.. వద్దు అంటే వదిలేయవచ్చు..!
Rental Bride విచిత్ర సంప్రదాయం..
వివాహాలు ఏర్పాటు చేసే ఏజెంట్ కన్యాశుల్కంలో సగం తీసుకుంటాడు. మిగిలిన సగం అమ్మాయికి లభిస్తుంది. ఈ డబ్బు 40 నుండి 80 వేల వరకు ఉంటుంది. థాయిలాండ్‌లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. ఇక్కడ భార్యలను కాంట్రాక్టుపై తీసుకుంటారు. వీరి మొత్తం 15 నుండి 25 వేల వరకు ఉంటుంది. ఈ రకమైన అనధికారిక , తాత్కాలిక వివాహాన్ని ఆనంద వివాహం అంటారు.
లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రకారం ఇటువంటి వివాహాలు ఆ ప్రాంతంలో పర్యాటకాన్నిప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు. అక్కడి ప్రాంతానికి చెందిన ఒక వధువు అయిన మహిళ మాట్లాడుతూ తాను 17 సంవత్సరాల వయస్సు నుండి ఈ పని చేస్తున్నానని ఇప్పటివరకు 15 మంది భర్తలను కలిగి ఉన్నట్టు పేర్కొంది. థాయిలాండ్‌లో అలాంటి మహిళలను వేలం వేస్తారని లీగల్ సర్వీసెస్ ఇండియా నివేదిక పేర్కొంది. మహిళలకు రూ.15,000 నుండి రూ.25,000 వరకు జీతం చెల్లిస్తున్నారు. తరచుగా వారికి 2 లక్షల రూపాయల వరకు లభిస్తుంది. దీనితో పాటు ఒక సంవత్సరం పాటు ఒప్పందం కూడా చేయబడుతుంది.