Revanth Reddy : ఏం ప్లాన్ బాస్‌.. బీఆర్ఎస్ వాళ్లు తెచ్చుకున్న క‌త్తితో వాళ్లే కోసుకునేలా చేసిన రేవంత్‌రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : ఏం ప్లాన్ బాస్‌.. బీఆర్ఎస్ వాళ్లు తెచ్చుకున్న క‌త్తితో వాళ్లే కోసుకునేలా చేసిన రేవంత్‌రెడ్డి..!

 Authored By anusha | The Telugu News | Updated on :23 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ .. బీఆర్ఎస్ కు చెక్..!

  •  రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ వేసాడో కానీ.. బీఆర్ఎస్ దాని గొంతు అదే కోసుకుంది.. !!

  •  ఏం ప్లాన్ బాస్‌.. బీఆర్ఎస్ వాళ్లు తెచ్చుకున్న క‌త్తితో వాళ్లే కోసుకునేలా చేసిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం పై న్యాయ విచారణలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం విద్యుత్ ఒప్పందాలపై బీఆర్ఎస్ నేతలు కోరిక మేరకు విచారణలకు ఆదేశిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలే విచారణకు సవాల్ చేశారు. అదే అదనుగా భావించి రేవంత్ రెడ్డి విచారణ ప్రకటించేశారు. గడిచిన పదేళ్లలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఛతీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తాం అనఅన్నారు. ు దీనికి కారణం మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేయించుకోవాలని సవాల్ చేయడమే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో కవిత విచారణ చేసుకోండి అని సవాల్ విసిరారు. దీంతో రేవంత్ కాళేశ్వరం వద్దకు సభ్యులను తీసుకెళ్తామని ప్రకటించారు. దీనికి కవిత కాళేశ్వరం ఏమైనా టూరిస్ట్ ప్లేస్ నా అని ప్రశ్నించారు. దీనికి రేవంత్ బదులిస్తూ ప్రాజెక్టులో ఏం జరిగిందో సభ్యులతోపాటు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతే కాకుండా సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాళేశ్వరం పై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలను బస్సులో కాళేశ్వరం తీసుకెళ్లి చూపించారు. అంతేకాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. కానీ పర్యాటక కళ రాకముందే మేడిగడ్డ కుంగింది. అన్నారానికి బుంగలు పడ్డాయి. విచారణలో ఏమి తేలుతుందో కానీ తాము కక్ష సాధింపులకు పాల్పడలేదని, వారే విచారణకు డిమాండ్ చేసినందున విచారణ చేయించామని రేవంత్ అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం విచారణ చేయించుకోండి అని సవాల్ విసరడంతో విచారణ జరిపించి గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియజేస్తున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది