Revanth Reddy : హస్తం గూటికి చేరే 15 మంది నేతల లిస్ట్ రెడీ
Revanth Reddy : తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న కసిలో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే కర్ణాటకలో గెలిచి సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ తెలంగాణలో గెలిచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ ను తీసుకురావాలని భావిస్తోంది. అందుకే తెలంగాణలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఏకంగా సోనియా గాంధీనే రంగంలోకి దిగి తెలంగాణ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే హైదరాబాద్ వేదికగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం, సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలంతా ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం వేశారు.
స్క్రీనింగ్ కమిటీ కూడా 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను రెడీ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును మాత్రం సెప్టెంబర్ 17న ప్రకటించే అవకాశం ఉంది. సోనియా గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని ఆమె పూరించనున్నారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 17న సోనియా గాంధీ భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ఇవన్నీ పక్కన పెడితే వేరే పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పలువురు ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ బహిరంగ సభలోనే హస్తం గూటికి ఆ నేతలు చేరే అవకాశం ఉంది. వాళ్ల లిస్టును కూడా రేవంత్ రెడ్డి ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది.
Revanth Reddy : వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం
బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలకు ఇప్పటికే హస్తం పార్టీ నేతలు గాలం వేస్తున్నారు. కీలక నేతలు అయితేనే పార్టీకి బలం వస్తుందని.. వీళ్లంతా సోనియమ్మ సమక్షంలో కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్, బీజేపీలకు భారీ షాక్ ఇచ్చేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.