Revanth Reddy : టార్గెట్ 80.. కాంగ్రెస్ తిరుగులేని స్కెచ్ ఇదే.. ఈసారి గెలుపు ఖాయం?
Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో ఎన్నికలకు టైమ్ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది. బీజేపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతోంది. కర్ణాటకలో గెలిచిన ఊపుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అందులో భాగంగానే అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. ఇప్పటికే సోనియా గాంధీ సభ విజయవంతం కావడం, ఆరు గ్యారెంటీ పథకాలు కూడా తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
ఒకేసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలోనే 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 80 సీట్లు ఖచ్చితంగా గెలవడంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే. కానీ.. 80 సీట్లు ఖచ్చితంగా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఎన్నికల అభ్యర్థుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని వడబోసే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. స్క్రీనింగ్ కమిటీ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలుస్తోంది. ముందు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అనుకున్నా.. ఒకేసారి 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Revanth Reddy : ఎన్నికల సమారానికి త్వరలోనే శంఖారావం
ఒకేసారి 119 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరానికి శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. 80 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అక్కడ అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అవుతోంది. అలాగే.. ఇతర పార్టీల నుంచి టికెట్ హామీ ఇస్తే కొందరు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కాగా 80 స్థానాల్లో గెలుపు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పక్కా వ్యూహాన్ని రచిస్తోంది.