Revenge Politics : రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవడం ఖాయమా?
Revenge Politics : గత రాజకీయాలు వేరు. ఇప్పటి రాజకీయాలు వేరు. నలుగురికి మంచి చేయాలని వచ్చి ప్రత్యర్ధులని మట్టి కరిపించాలని చూస్తే వారికే ఎదురు దెబ్బ తగులుతుంది. ఇది గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాజకీయాల చూస్తే పుష్కర కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండగా, అప్పుడు ఉమ్మడి ఏపీలో తనకు బలం ఉందని భావించి అధికార గర్వంతో నాడు జగన్ ని జైలులో పెట్టించింది. దాదాపు పదహారు నెలల పాటు జగన్ జైలులో ఉండగా, ఆ తర్వాత ఆయనకి సింపథీ పెరిగింది. దాంతో జగన్ ఏపీలో కాంగ్రెస్ట్ పార్టీనే లేకుండా చేశాడు. ఇప్పటికి మూడు ఎన్నికలు వరసగా జరిగితే ఏపీలో ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ కోలుకుంది లేదు.
రివెంజ్ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ చతికిల పడింది. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఇక స్కిల్స్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు రెండునెలలపాటు రాజమండ్రి జైలులో గడిపారు. తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యనేతలు ఎవరైనా జైలుకి వెళ్తే కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనేది ముగ్గురు నేతలే ఇందుకు ఉదాహరణ. ఈసారి టీడీపీ గెలవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందరూ కూటమి కారణమని అంటారు. కానీ అసలు విషయం అది కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నా రంటే అందుకు కారణం సీఎం జగన్. ఇది ముమ్మాటికీ నిజమని సొంత పార్టీలే చెప్పుకోవడం కొసమెరుపు.
Revenge Politics : రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవడం ఖాయమా?
ఇక జాతీయ రాజకీయా విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ని ఆ పార్టీ అధినాయకులను గాంధీ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేస్తూ వచ్చారు. దాంతో బీజేపీ ఈ సారి అంతగా మెజారిటీ దక్కించుకోలేకపోయింది. మోడీ పోటీ చేసిన వారణాసిలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ దారుణంగా పడిపోయింది. కౌంటింగ్ దశలో కొన్ని రౌండ్లలో మోడీ వెనకబడిపోవడమూ జరిగింది అంటే ప్రతీకారం మంట ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇకముందైనా రాబోయే పాలకులు ఆయా విషయాలు గుర్తెరిగి పాలిస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు.వారి అధికారం కూడా పర్మినెంట్‌గా ఉండే అవకాశం ఉంది.
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
This website uses cookies.