Revenge Politics : రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవ‌డం ఖాయ‌మా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revenge Politics : రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవ‌డం ఖాయ‌మా?

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Revenge Politics : రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవ‌డం ఖాయ‌మా?

Revenge Politics : గ‌త రాజ‌కీయాలు వేరు. ఇప్ప‌టి రాజ‌కీయాలు వేరు. న‌లుగురికి మంచి చేయాల‌ని వ‌చ్చి ప్ర‌త్య‌ర్ధుల‌ని మ‌ట్టి క‌రిపించాల‌ని చూస్తే వారికే ఎదురు దెబ్బ త‌గులుతుంది. ఇది గ‌త కొంత కాలంగా మ‌నం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాజకీయాల చూస్తే పుష్కర కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండ‌గా, అప్పుడు ఉమ్మడి ఏపీలో తనకు బలం ఉందని భావించి అధికార గర్వంతో నాడు జగన్ ని జైలులో పెట్టించింది. దాదాపు పదహారు నెలల పాటు జగన్ జైలులో ఉండగా, ఆ త‌ర్వాత ఆయ‌న‌కి సింప‌థీ పెరిగింది. దాంతో జ‌గ‌న్ ఏపీలో కాంగ్రెస్ట్ పార్టీనే లేకుండా చేశాడు. ఇప్పటికి మూడు ఎన్నికలు వరసగా జరిగితే ఏపీలో ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ కోలుకుంది లేదు.

Revenge Politics అలా చేస్తే అంతే..

రివెంజ్ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ చ‌తికిల ప‌డింది. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఇక స్కిల్స్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు రెండునెలలపాటు రాజమండ్రి జైలులో గడిపారు. తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యనేతలు ఎవరైనా జైలుకి వెళ్తే కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనేది ముగ్గురు నేతలే ఇందుకు ఉదాహరణ. ఈసారి టీడీపీ గెలవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందరూ కూటమి కారణమని అంటారు. కానీ అసలు విషయం అది కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నా రంటే అందుకు కారణం సీఎం జగన్. ఇది ముమ్మాటికీ నిజమని సొంత పార్టీలే చెప్పుకోవడం కొసమెరుపు.

Revenge Politics రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవ‌డం ఖాయ‌మా

Revenge Politics : రివేంజ్ పాలిటిక్స్ చేస్తే అధికారం పొగొట్టుకోవ‌డం ఖాయ‌మా?

ఇక జాతీయ రాజకీయా విష‌యానికి వ‌స్తే ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ని ఆ పార్టీ అధినాయకులను గాంధీ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేస్తూ వచ్చారు. దాంతో బీజేపీ ఈ సారి అంత‌గా మెజారిటీ ద‌క్కించుకోలేక‌పోయింది. మోడీ పోటీ చేసిన వారణాసిలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ దారుణంగా పడిపోయింది. కౌంటింగ్ దశలో కొన్ని రౌండ్లలో మోడీ వెనకబడిపోవడమూ జరిగింది అంటే ప్రతీకారం మంట ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇకముందైనా రాబోయే పాలకులు ఆయా విషయాలు గుర్తెరిగి పాలిస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు.వారి అధికారం కూడా ప‌ర్మినెంట్‌గా ఉండే అవ‌కాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది