Modi 3.0 Cabinet : ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని పదవి అధిరోహించబోతున్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఆయన కేబినేట్‌లో ఎవరెవరు స్థానం దక్కించుకోబోతున్నారు అనే సస్పెన్స్ నెలకొని ఉండగా, దానిపై ఒక క్లారిటీ వచ్చింది. మోదీతో పాటు తొలి విడతలో 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో 78 నుంచి 81 మందికి అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 50 మంది వరకూ తీసుకున్నట్టు సమాచారం. కేబినెట్‌లో బీజేపీ నుంచి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, హరదీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్, మనుసుఖ్ మాండవీయా, పియూష్ గోయల్, కిరణ్ రిజుజులు, గజేంద్రసింగ్ షెకావత్, శోభా కరద్లాంజే, గిరిరాజ్ సింగ్, క్యాబినెట్‌లో కొనసాగనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, మనోహర్‌లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్‌లతో పాటు త్రిసూర్ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వీరితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు చోటుదక్కింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు.
శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను సహాయ మంత్రి పదవి వరించింది.వీరందరు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖలు వరించాయన్న దానిపై స్పష్టత రావల్సి ఉంది.ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం మాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు.. మారిషస్ ప్రెసిడెంట్ ప్రవింద్ జుగ్నౌథ్ కూడా ఢిల్లీకి వచ్చారు. భారత సంప్రదాయం ప్రకారం వీరికి స్వాగతం పలికారు. సాయంత్రం ప్రధాని ప్రమాణస్వీకారంలో వీరు పాల్గొంటారు. ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళి అర్పించారు
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.