Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా పై కీలక నిర్ణయాలు..?
ప్రధానాంశాలు:
Rythu Bharosa : రైతు భరోసా పథకానికి సంబంధించి నేడు రానున్న పూర్తి క్లారిటీ..క్యాభినేట్ భేటిలో ఏం చర్చించనున్నారు..!
Rythu Bharosa : ఏపీ ప్రభుత్వం Ap Govt ఏ పథకం అమలు చేసినా.. కూడా దానికి సంబంధించి కచ్చితమైన గైడ్‌లైన్స్ విడుదల చేస్తోంది. వాటిని సరిగా అర్థం చేసుకోకపోతే, లబ్దిదారులు పథకం ప్రయోజనాలు మిస్సవుతారు. ఇప్పుడు రైతు భరోసా Rythu Bharosa విషయంలో అందరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.ఈనెల 19న దావోస్ పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటుగా సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
Rythu Bharosa : క్లారిటీ ఈ రోజే..
సచివాలయాల క్రమబద్దీకరణ, రైతు భరోసా Rythu Bharosa అమలు, అన్న క్యాంటీన్లు, కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలపై దీనిపై పూర్తి క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ భేటీ చేపట్టాలని నిర్ణయం తీసుకోగా, ఈ రోజు భేటి జరగనుంది. ఈ భేటిలో భూ కేటాయింపులకు ఆమోదముద్ర వేయనుంది క్యాబినెట్ Cabinet . సచివాలయాల క్రమబద్ధీకరణ పై ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సచివాలయాల్లో 1.27 లక్షల మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వాలంటీర్ల అంశంపై సైతం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో సైతం మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల విషయం, రైతుల ఖాతాల్లో నిధులు ఎప్పుడు జమ చేస్తాం అన్న విషయంలో స్పష్టత ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అన్న క్యాంటీన్లు పల్లెలకి విస్తరించే విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పై కూడా స్పష్టత వచ్చే పరిస్థితి ఉంది. తిరుపతి Tirupathi లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రివర్గ సహచరులకు సీఎం చంద్రబాబు Chandrababu Naidu వివరించే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు తన దావోస్ పర్యటనకు సంబంధించి లక్ష్యాలను సైతం వివరించనున్నారు.అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పటికే అనేక పథకాల పేర్లు మార్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతోంది. మరి పథకాలని ఎలా ఎప్పుడు అమలు చేస్తారన్నది చూడాలి.