Categories: Newspolitics

Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి

Ys sharmila : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. కంపెనీలోని వాటాల గురించి వైఎస్‌ జగన్, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్‌ వేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే వివాదమే తమ ఇంట్లో ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన షర్మిల.. ప్రతీ ఇంట్లో తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సర్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.

Ys sharmila మ‌రింత ముదిరేలా ఉందిగా..!

గొడవలు పెట్టుకోవాలని తమ ఉద్దేశం కాదని అన్నారు. సామరస్యంగా, 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలని తమకు తెలుసని చెప్పారు. ఆస్తి గొడవలు సామాన్యమని.. అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే.. తల్లిని, చెల్లిని వైఎస్ జగన్ కోర్టుకు ఈడ్చారని పేర్కొన్న షర్మిల.. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లిపై ప్రేమతోనే జగన్‌ షేర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు అనేది పచ్చి అబద్ధమని షర్మిల తెలిపారు. ఇక ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుతో పాటు పేర్ని నాని కూడా మ‌ధ్య‌లో దూరి ప‌లు కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సాక్షి ష‌ర్మిళ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించి వివాదం మరింత ముదిరేలా చేసింది.

Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి

చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి ష‌ర్మిళ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంద‌ని భావించిన సాక్షి.. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి మరీ సొంత సోదరుడిపై కుట్రలకు దిగుతున్న చెల్లి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఆస్తుల బదలాయింపు వల్ల తన సోదరుడు న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా గిఫ్ట్ డీడ్ ను షేర్లుగా మార్చుకుని దుర్వినియోగం చేశారంటే ఏమనాలి? దీనిపై జగన్ కు సమాచారం ఇవ్వకపోవడంలో అర్ధం ఏమిటి? అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ఈడీ 2016లో ఎటాచ్ చేసిన సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని చెబుతున్న జగన్… 2019లో 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అంటూ కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు.

Recent Posts

Sleeping : నిద్ర భంగిమ‌ల‌తో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!

Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…

38 minutes ago

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

2 hours ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

3 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

4 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

13 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

14 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

15 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

16 hours ago