Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి

Ys sharmila : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. కంపెనీలోని వాటాల గురించి వైఎస్‌ జగన్, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్‌ వేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి

Ys sharmila : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. కంపెనీలోని వాటాల గురించి వైఎస్‌ జగన్, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్‌ వేయడంతో వివాదం రాజుకుంది. ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించగా.. ఆ వ్యాఖ్యలకు ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అన్ని కుటుంబాల్లో ఉండే వివాదమే తమ ఇంట్లో ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన షర్మిల.. ప్రతీ ఇంట్లో తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సర్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.

Ys sharmila మ‌రింత ముదిరేలా ఉందిగా..!

గొడవలు పెట్టుకోవాలని తమ ఉద్దేశం కాదని అన్నారు. సామరస్యంగా, 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలని తమకు తెలుసని చెప్పారు. ఆస్తి గొడవలు సామాన్యమని.. అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే.. తల్లిని, చెల్లిని వైఎస్ జగన్ కోర్టుకు ఈడ్చారని పేర్కొన్న షర్మిల.. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లిపై ప్రేమతోనే జగన్‌ షేర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు అనేది పచ్చి అబద్ధమని షర్మిల తెలిపారు. ఇక ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుతో పాటు పేర్ని నాని కూడా మ‌ధ్య‌లో దూరి ప‌లు కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సాక్షి ష‌ర్మిళ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించి వివాదం మరింత ముదిరేలా చేసింది.

Ys sharmila జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌ మ‌ధ్య‌లో దూరిన సాక్షి

Ys sharmila : జ‌గ‌న్‌ని వదిలిపెట్టేది లేదంటున్న ష‌ర్మిళ‌.. మ‌ధ్య‌లో దూరిన సాక్షి

చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి ష‌ర్మిళ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుంద‌ని భావించిన సాక్షి.. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి మరీ సొంత సోదరుడిపై కుట్రలకు దిగుతున్న చెల్లి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఆస్తుల బదలాయింపు వల్ల తన సోదరుడు న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా గిఫ్ట్ డీడ్ ను షేర్లుగా మార్చుకుని దుర్వినియోగం చేశారంటే ఏమనాలి? దీనిపై జగన్ కు సమాచారం ఇవ్వకపోవడంలో అర్ధం ఏమిటి? అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ఈడీ 2016లో ఎటాచ్ చేసిన సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని చెబుతున్న జగన్… 2019లో 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అంటూ కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది