Siddham Meeting Addanki : ప్రకాశం జిల్లాలో ‘ సిద్ధం ‘ చివరి సభ.. వైయస్ జగన్ ఇచ్చే హామీలపై సర్వత్రా ఆసక్తి..!
ప్రధానాంశాలు:
Siddham Meeting : ప్రకాశం జిల్లాలో ' సిద్ధం ' చివరి సభ.. వైయస్ జగన్ ఇచ్చే హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Siddham Meeting : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకాలపై ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం వైయస్ జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఏంటి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారు. సిద్ధం సభ వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించిన వైయస్ జగన్ ఈరోజు మార్చి 10 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.
సిద్ధం సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సభ ప్రారంభం కాకముందే వైసీపీ కార్యకర్తలు అంతా వేలల్లో సభకు చేరుకున్నారు. ఆరు జిల్లాలు 43 నియోజకవర్గ సెగ్మెంట్లే టార్గెట్ గా వైసీపీ సిద్ధం చివరి సభ జరగనుంది. ఈ సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా ఎలాంటి కొత్త హామీలు ప్రవేశపెడతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై వైయస్ జగన్ కౌంటర్ ఎలా ఉండబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. సిద్ధం చివరి సభ లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది వైసీపీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే టీడీపీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీని మించి పథకాలను ప్రకటిస్తుందని టీడీపీ ఎన్నికలు మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టోలో సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెన్షన్లను ఐదువేల వరకు పెంచుకుంటూ వెళ్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే డ్వాక్రా, రైతు రుణమాఫీ వంటి అంశాలపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చే హామీలను నేరవేరుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.