Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2025,7:15 pm

ప్రధానాంశాలు:

  •  Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..!

  •  Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..!

Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. వాటిలో ఇటీవ‌ల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఇట్టే గుర్తుకు వ‌స్తుంది. ఈ సినిమా చూసినవారికి, పోలీసులు కళ్లు గప్పి ఖరీదైన సరుకులు రవాణా చేసే స్టైల్ మదిలో మెదులుతుంది. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న ఒక సంఘటన చూస్తే, అచ్చం పుష్ప మాదిరిగానే ఉంది.

Smuggling కోటి రూపాయల వెండి బిస్కెట్లు పుష్ప స్టైల్ స్మగ్లింగ్‌ షాక్‌లో పోలీసులు

Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్‌.. షాక్‌లో పోలీసులు..!

Smuggling : పుష్ప సీన్‌ని త‌ల‌పించేలా..

ఒడిశాలోని సంభాల్‌పూర్ జిల్లా రెంగాలిలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఆపారు. వాహనం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబరుతో ఉండగా, లోపల పరిశీలించిన‌ అధికారులు వెనుక సీటు కింద ఓ రహస్య ఛాంబర్ కనిపించి షాక్ అయ్యారు.

ఆ ఛాంబర్‌ లో ఏకంగా 110 వెండి బిస్కెట్లు లభించాయి. ఒక్కో బిస్కెట్ బరువు సుమారు 1 కిలోగ్రామ్. మొత్తం బరువు 100 కిలోలకుపైగా ఉండగా, వీటి మార్కెట్ విలువ రూ. 1 కోటి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.వెండికి సంబంధించి సరైన పత్రాలు చూపించలేకపోవడంతో, అధికారులు బిస్కెట్లను స్వాధీనం చేసుకొని, వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ వెండిని రాయ్‌పూర్ నుంచి రాంచీకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం ఆబ్కారీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది