
Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్.. షాక్‌లో పోలీసులు..!
Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. వాటిలో ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఇట్టే గుర్తుకు వస్తుంది. ఈ సినిమా చూసినవారికి, పోలీసులు కళ్లు గప్పి ఖరీదైన సరుకులు రవాణా చేసే స్టైల్ మదిలో మెదులుతుంది. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న ఒక సంఘటన చూస్తే, అచ్చం పుష్ప మాదిరిగానే ఉంది.
Smuggling : కోటి రూపాయల వెండి బిస్కెట్లు.. ‘పుష్ప’ స్టైల్ స్మగ్లింగ్.. షాక్‌లో పోలీసులు..!
ఒడిశాలోని సంభాల్‌పూర్ జిల్లా రెంగాలిలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఆపారు. వాహనం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబరుతో ఉండగా, లోపల పరిశీలించిన అధికారులు వెనుక సీటు కింద ఓ రహస్య ఛాంబర్ కనిపించి షాక్ అయ్యారు.
ఆ ఛాంబర్ లో ఏకంగా 110 వెండి బిస్కెట్లు లభించాయి. ఒక్కో బిస్కెట్ బరువు సుమారు 1 కిలోగ్రామ్. మొత్తం బరువు 100 కిలోలకుపైగా ఉండగా, వీటి మార్కెట్ విలువ రూ. 1 కోటి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.వెండికి సంబంధించి సరైన పత్రాలు చూపించలేకపోవడంతో, అధికారులు బిస్కెట్లను స్వాధీనం చేసుకొని, వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ వెండిని రాయ్‌పూర్ నుంచి రాంచీకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం ఆబ్కారీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.