Ambati Rayudu : వారాహి విజయభేరి యాత్రలో పవన్ తో అంబాటి రాయుడు… జగనన్న పరువు తీసేసాడుగా..!
ప్రధానాంశాలు:
Ambati Rayudu : వారాహి విజయభేరి యాత్రలో పవన్ తో అంబాటి రాయుడు... జగనన్న పరువు తీసేసాడుగా..!
Ambati Rayudu : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని గురువారం రాత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గం లో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ క్రికెటర్ అంబాటి రాయుడు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలో బోట్లు తగలబడ్డ పట్టించుకోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం ఏం బాగు చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. ఇంకా అదే సమయంలో నష్టపోయిన వారికి తాను 50 వేల రూపాయలు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. నేను ఇచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా వారిని ఆదుకుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని , ప్రజలందరికీ కచ్చితంగా మంచి చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టాలంటే కూటమి గెలవాలని తెలియజేశారు. అలాగే ప్రజల సమస్యల తరుపున అసెంబ్లీలో తాను మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం అంబటి రాయుడు గురించి మాట్లాడుతూ..19 ఏళ్ల వయసులో అండర్ 19 క్రికెట్ లో డబల్ సెంచరీ కొట్టి ఈరోజు వరకు సత్త చాటుతూ వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని ఉద్దేశంతో మనకు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మాట్లాడాల్సిందిగా కోరుతూ పవన్ కళ్యాణ్ మైక్ ఇచ్చారు…
Ambati Rayudu : సరైన దారికి తీసుకువచ్చినందుకు థాంక్స్ సార్ ..
అనంతరం మైక్ అందుకున్న అంబాటి రాయుడు మాట్లాడుతూ మొదట పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. నన్ను తప్పుదారి నుండి సరైన దారికి తీసుకువచ్చినందుకు థాంక్స్ సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడినే కాదు రాష్ట్ర ప్రజలందరిని తప్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే మన రాష్ట్రంలో 50 శాతం మంది యువత ఉన్నారని , రేపటి భవిష్యత్తు వారేనని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నాయకత్వ కూటమిలో ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లుగా ఆయన తెలిపారు. కావున ప్రజలందరూ కూడా కూటమికి మద్దతుగా నిలబడి వైసీపీ అరాచలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా తెలియజేశారు.