TDP Narayana : చంద్రబాబు వెన్నెముక పవన్ కళ్యాణ్.. ఆయన్ను సీఎం చేసి అయినా వాడిని తొక్కేస్తా.. నారాయణ ఫైర్
ప్రధానాంశాలు:
2019 ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలిచింది
వైసీపీ ప్రభుత్వంపై నారాయణ ఫైర్
టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన నారాయణ
TDP Narayana : టీడీపీ మాజీ మంత్రి నారాయణ తెలుసు కదా. ఆయన మీద ఈ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అక్రమాలు చేశారని విమర్శలు వచ్చాయి. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఎందుకో కొన్నేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ.. మళ్లీ ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు నారాయణ. నెల్లూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నారాయణ. ఈనేపథ్యంలో నియోజకవర్గంలోనే ఉంటూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనిల్ చేసే అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. తాజాగా మీడియా సమావేశం పెట్టిన నారాయణ.. మరోసారి అనిల్ కుమార్ పై విరుచుకుపడ్డారు. టీడీపీని ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. జనసేన పార్టీ ఆఫీసులో టీడీపీ, జనసేన నాయకులు ఇద్దరూ కలిసి ఉమ్మడి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
2019 లో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 10 వేల నుంచి 20 వేల దొంగ ఓట్లను వైసీపీ నేతలు వేయించుకున్నారు. నెల్లూరు సిటీలోనే తీసుకుంటే 10 వేల వరకు వేయించుకున్నారు. వేరే వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయించుకున్నారు. అందుకే రెండు పార్టీలు కలిసి డోర్ టు డోర్ వెరిఫై చేస్తాం. దొంగ ఓట్లను తీసేలా ప్రయత్నిస్తాం. ఇప్పటికే రెండు సార్లు టీడీపీ వెరిఫై చేసింది. 9 వేల దొంగ ఓట్లను టీడీపీ వెరిఫై చేసింది. ఇంకా కొన్ని ఏరియాల్లో దొంగ ఓట్లు ఉన్నాయి. అందుకే జనసేన, టీడీపీ ప్రతి బూత్ లో ఇంటికి వెళ్లి వెరిఫై చేస్తాం.. అని నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో ఎక్కడ చూసినా రోడ్లు దరిద్రంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలే. కొత్త రోడ్లు లేవు. ఈవిధంగా పరిస్థితి ఉంది. దాని మీద ఉమ్మడి కార్యచరణ తీసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ తెలియజేస్తాం.. అన్నారు.
TDP Narayana : చెత్త పన్ను ఎక్కడైనా ఉంటుందా?
అసలు ఎక్కడైనా చెత్త పన్ను ఉంటుందా? మా ప్రభుత్వంలో ఆ పేరే వినలేదు. చెత్త పన్ను వేస్తున్నారు కానీ.. చెత్త మాత్రం తీయడం లేదు. టీడీపీ హయాంలో తెల్లారే సరికి చెత్త తీసేవారు. అలాగే కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచారు. రేట్లు మామూలుగా పెరగలేదు. ప్రజలు అల్లాడుతున్నారు. ఒక చేత్తో ఇలా ఇస్తున్నాడు.. మరో చేత్తో ఇలా తీసుకుంటున్నాడు. ప్రజలు ఈ ప్రభుత్వం మీద పాజిటివ్ గా లేరు. ఈ రాష్ట్రంలో ఒక వర్గం లబోదిబో కొట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, వ్యాపారస్తులు అందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వాళ్లు టీడీపీని చూశారు.. ఈ ప్రభుత్వాన్ని చూశారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపార పన్ను వసూలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవ్వరూ చూడలేదు. సంక్షేమం లేదు.. ఏం లేదు.. అప్పులు తెస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాలన తెలియదు. ఒక ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలియదు. అభివృద్ధి, సంక్షేమం రెండింటి మీద దృష్టి పెట్టాలి అని నారాయణ మండిపడ్డారు.