Nellore TDP Seats : నెల్లూరు జిల్లాలో సీట్లు ఫిక్స్ చేసిన టీడీపీ.. మూడుచోట్ల మాత్రమే డౌట్.. వైసీపీలో ట్విస్ట్… వీడియో
Nellore TDP Seats : ఈ మధ్యలో ఏపీలో ఎక్కువ రాజకీయాల్లో నానుతున్న జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఎందుకంటే అక్కడ వైసీపీలో తిరుగుబాట్లు ఎక్కువ అవడం.. వైసీపీ నేతల మధ్య వర్గపోరు రావడం, వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు చెందిన వారు కావడం, టీడీపీకి అక్కడ అంతగా బలం లేకపోవడం, టీడీపీకి సరైన నాయకత్వం లేనిచోట వైసీపీ నేతలు తమ వర్గపోరును రోడ్డు మీదికి తీసుకురావడం, ఇవన్నీ టీడీపీకి బలం చేకూర్చాయి. నెల్లూరు జిల్లాలో 10 సీట్లను 2019 లో వైసీపీ స్వీప్ చేసింది. కానీ.. ఈసారి సగానికి సగం కూడా వచ్చే అవకాశం లేదు. టీడీపీ పార్టీ దీన్ని క్యాష్ చేసుకుంటుందా? టీడీపీ ఆ 5 సీట్లు గెలుస్తుందా?
10 నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు.. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో అప్పుడే తెలిసిపోయింది. ఇక.. టీడీపీ నుంచి నెల్లూరులో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరు పోటీ చేయనున్నారు. ఆనం రామనారాయణరెడ్డి కానీ.. ఆయన కూతురు కానీ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆత్మకూరు నుంచి పోటీ చేయకపోతే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరే వినిపిస్తోంది. ఆయన్ను పార్టీలోకి తీసుకొని నెల్లూరు రూరల్ టికెట్ టీడీపీ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. నెల్లూరు టౌన్ వచ్చేసరికి నారాయణ.. ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన పోటీ చేయకపోతే నెల్లూరు సిటీని ఆనంకి ఇచ్చే అవకాశం ఉంది.
Nellore TDP Seats : నెల్లూరు రూరల్ చూస్తూ శ్రీధర్ రెడ్డి పేరే వినిపిస్తోంది
గూడూరు నుంచి పాశం సునీల్ పోటీ చేసే అవకాశం ఉంది. కావలి గురించి చూస్తే ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ సుబ్బారాయుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు వేరే వాళ్లు కూడా టికెట్ కోసం చూస్తున్నారు. ఉదయగిరి నుంచి సురేశ్ కి ఇచ్చే అవకాశం ఉంది. సూళ్లూరుపెట నుంచి పనబాక పేరు పరిశీలిస్తున్నారు. వెంకటగిరి నుంచి రామకృష్ణకు ఇచ్చే అవకాశం ఉంది. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి వారసుడు రాజగోపాల్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. కొవ్వూరు నుంచి దినేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో 10 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ టికెట్ల లిస్టు ఇది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది.