
Chandrababu : పిఠాపురం వర్మకి చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేశారా..!
Chandrababu : ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా మారాయో మనం చూశాం. అయితే అన్నింటికన్నా కూడా పిఠాపురం నియోజక వర్గం చాలా ఆసక్తిరేపింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తుండడంతో దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే పవన్ ఎన్నికను తన భుజాలపై వేసుకుని, అంతా తానై వ్యవహరించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో కలుసుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ .. పిఠాపురం ఎన్నికలు జరిగిన తీరును వివరించారు.
స్థానికంగా పవన్ కళ్యాణ్ కు తాము అందించిన మద్దతు గురించి తెలిపారు. అలాగే పవన్ కు అనుకూలంగా పిఠాపురంలో జరిగిన పోలింగ్, ఆయన మెజార్టీపై కూడా వివరణ ఇచ్చారు. పవన్ గెలుపుకు దోహదం చేయబోతున్న అంశాల్ని కూడా చంద్రబాబుకు వర్మ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ శ్రేణులు పవన్ కు మద్దతుగా ఓట్ల బదిలీ కోసం ఎలా పనిచేశాయన్నదీ వివరించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలువబోతున్నారని చంద్రబాబుకు వివరించినట్లు వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ట్వీట్ కు స్పందనగా జనసేన క్యాడర్ కూడా తాము రాష్ట్రంలో అదే విధంగా టీడీపీ విజయం కోసం పనిచేసినట్లు ట్వీట్లు పెడుతున్నారు. మరికొందరు వర్మ త్యాగాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తుందని జనసేన, టీడీపీ నేతలు ఇప్పటికే అంచనా వేసుకుంటున్నారు.
Chandrababu : పిఠాపురం వర్మకి చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేశారా..!
ఈసారి ఎన్నికల్లో స్టేట్ వైడ్ ఫిగర్ గా ఎదిగిన నేత పిఠాపురం వర్మ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజారిటీ సాధించారు. అప్పుడే టీడీపీ అధినాయకత్వం దృష్టిలో పడిన వర్మకు ఆనాడే మంత్రి పదవి దక్కాలి. కానీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సామాజిక సమీకరణలలో భాగంగా బీసీలకు కాపులకు క్యాబినెట్ లో నాడు బాబు స్థానం కల్పించారు.అయితే ఇప్పుడు వర్మకి ఎలాంటి స్థానం కల్పిస్తారు అన్న ప్రచారం జరుగుతుంది.చూస్తుంటే ముందు ఆయనకి ఎమ్మెల్సీ పదవి అయితే ఇవ్వవచ్చు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి అందులో తొలి ప్రాధాన్యతగా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారు అని అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.