Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి గుడి క‌ట్టాలా.. వైసీపీ నేత నుండి స్ట‌న్నింగ్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి గుడి క‌ట్టాలా.. వైసీపీ నేత నుండి స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాలు ఎంత రంజుగా మారాయో మ‌నం చూశాం. కూట‌మి, వైసీపీ మ‌ధ్య పోరు ఓ రేంజ్‌లో సాగింది. ఎవ‌రు గెలుస్తారా అనే సస్పెన్స్ ఉండ‌గా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూటమి ఘన విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది కీలకపాత్ర అని.. కేవలం పవన్ వల్ల మాత్రమే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని.. ఈ గెలుపులో ఆయనే […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి గుడి క‌ట్టాలా.. వైసీపీ నేత నుండి స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాలు ఎంత రంజుగా మారాయో మ‌నం చూశాం. కూట‌మి, వైసీపీ మ‌ధ్య పోరు ఓ రేంజ్‌లో సాగింది. ఎవ‌రు గెలుస్తారా అనే సస్పెన్స్ ఉండ‌గా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూటమి ఘన విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది కీలకపాత్ర అని.. కేవలం పవన్ వల్ల మాత్రమే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని.. ఈ గెలుపులో ఆయనే “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అనే కామెంట్స్ వినిపించాయి. మొన్నటివరకూ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, నాలుగు పెళ్లాలు అంటూ పవన్ పై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ‌గా, రిజ‌ల్ట్స్ త‌ర్వాత మాత్రం కూటమి గెలుపు క్రెడిట్ మొత్తం పవన్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.

Pawan Kalyan ప‌వన్‌కి గుడి క‌ట్టాలి..

చంద్రబాబు అలవిగాని హామీలతో పాటు పవన్ ఛరిష్మా వల్లే టీడీపీ నేతలు కూడా గెలిచారని అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ వల్లే గెలిచారు.. ఆయనకు వారంతా గుడి కట్టి పూజలు చేయాలి అంటూ కామెంట్ చేశారు మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భారత్. తాజాగా విభజన సమస్యలమీద రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన ఘటనపై స్పందిస్తూ… ఆ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ ను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… టీడీపీ నేతలపై కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా… రెండు రాష్ట్రాల సీఎంలు భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారని గుర్తు చేసిన భరత్… మరి ఇంత కీలకమైన భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆహ్వానించకపొవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి గుడి క‌ట్టాలా వైసీపీ నేత నుండి స్ట‌న్నింగ్ కామెంట్స్

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి గుడి క‌ట్టాలా.. వైసీపీ నేత నుండి స్ట‌న్నింగ్ కామెంట్స్..!

అసలు ఇవాళ టీడీపీ కూటమి అధికారంలో ఉందంటే… దానికి నూటికి 99 మార్కులు పవన్ కల్యాణ్ కు ఇవ్వాలని.. అలాంటి పవన్ లేకుండా సమావేశం జరిగిందని అన్నారు. ఏపీ పోర్టుల్లో తెలంగాణ వాటా అడుగుతుందని.. టీటీడీలోనూ తెలంగాణ వాటా అడుగుతోందనే వార్తలొచ్చాయన్న ఆయన.. ఈ వార్తలను ఎవరూ ఖండించలేదన్నారు.ఏపీకి తెలంగాణ నుంచి రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్న మార్గాని భరత్.. భద్రాచలం వద్ద 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతారనే వార్తలొచ్చాయన్నారు. వీటిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టం కాలపరిమితి పదేళ్లు మాత్రమేనన్న భరత్.. దాన్ని మరో పదేళ్లపాటు పొడిగిస్తే బాగుంటుందన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది