Peddi Reddy VS Chandrababu : పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు.. ఆయనంటే బాబుకు ఎందుకు అంత భయం?
Peddi Reddy VS Chandrababu : చిత్తూరు జిల్లా రాజకీయాలు పెద్ద పెద్ద నేతల మీదుగానే నడుస్తుంటాయి. ఎందుకంటే.. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు అక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. మంత్రి పెద్దిరెడ్డిది కూడా చిత్తూరు జిల్లానే. మీకో విషయం తెలుసా? ఇద్దరూ రాజకీయాల్లో పరిచయం కాలేదు. ఇద్దరూ విద్యార్థి దశ నుంచే ఒకరికి మరొకరు పరిచయం ఉన్న నేతలు. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలోనే తమ రాజకీయాలను ప్రారంభించారు. అప్పటి నుంచే వీళ్ల మధ్య వార్ ప్రారంభం అయింది.
ఎస్వీ యూనివర్సిటీలోనే పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలు ప్రారంభమయ్యాయి. నిజానికి చంద్రబాబు.. పెద్దిరెడ్డి కంటే ఏడాది సీనియర్. ఇద్దరూ అక్కడే చదివారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషియాలజీ సబ్జెక్ట్ ను ఎంచుకోగా.. చంద్రబాబు ఎకనామిక్స్ తీసుకున్నారు. అయితే.. ఎస్వీయూలో అప్పట్లోనే కమ్మ, రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఎస్వీయూ వర్సిటీ ఎన్నికల్లో రెడ్ల ఆధిపత్యామే ఎక్కువగా కొనసాగేది. ఆ ఆధిపత్యాన్ని పెద్దిరెడ్డి కొనసాగించారు.నిజానికి ఎస్వీయూ చైర్మన్ గా పెద్దిరెడ్డి 1975లోనే ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ ఐ తరుపున గెలిచారు. అంటే.. చదువుకునే రోజుల్లోనే వీళ్ల మధ్య రాజకీయ వైరం ఏర్పడింది.అది అలాగే ఇప్పటి వరకు కంటిన్యూ అయింది.. అవుతూనే ఉంది. ఇప్పుడు పుంగనూరులో చంద్రబాబును అడుగు పెట్టనీయకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారు.
Peddi Reddy VS Chandrababu : 1975లోనే ఎస్వీయూ చైర్మన్ గా పెద్దిరెడ్డి ఎన్నిక
అయితే.. అప్పట్లోనే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే భయం ఉండేదట. ఆ భయం ఇప్పటికీ కొనసాగుతోందని.. ఇప్పటికీ ఆ భయం అలాగే ఉందని అంటున్నారు. ఇప్పుడు బాబుతో పాటు ఆయన కొడుకు లోకేశ్ కి కూడా పెద్దిరెడ్డి అంటే భయం అని అంటున్నారు. అందుకే.. లోకేశ్ తన పాదయాత్రను పుంగనూరులో కొనసాగించలేదనే వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి ఈ భయం ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో?