Tdp : ఆ నియోజికవర్గం లో రెండు వర్గాలు గా చీలిపోయిన టీడీపీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tdp : ఆ నియోజికవర్గం లో రెండు వర్గాలు గా చీలిపోయిన టీడీపీ !

 Authored By sekhar | The Telugu News | Updated on :22 July 2023,1:00 pm

Tdp : ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చతికిలబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విభజన జరిగినా అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అధికారం కైవసం చేసుకుంది. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మరోపక్క చంద్రబాబు వయసు మీద పడుతూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో అన్న వైసీపీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరోసారి అధికారం దిశగా అడుగులు వెయ్యబోతున్నట్లు అనేక సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీ కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా చంద్రబాబుకి వయసు మీద పడటంతో పాటు మరోపక్క తెలుగుదేశం పార్టీలో చెప్పుకోదగ్గ బలమైన నాయకుడు లేకపోవడంతో.

ఈసారి ఓడిపోతే టీడీపీ దుకాణం సర్దుకోవడమే అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకో అక్కరలేదని నేతలకు చెబుతున్నారు. పరిస్తితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలలో సైతం ఆత్మస్థైర్యం తగ్గిపోతున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళ్తే చాలా నియోజకవర్గాలలో అంతర్గత కొమ్ములాటలు ఉండటంతో.. గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఈ పరిణామాలతో ఎవరికివారు రెండు వర్గాలుగా చీలిపోతూ ఉన్నారు. తాజాగా రాజానగరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఏర్పడినట్లు టాక్. విషయంలోకి వెళ్తే అక్కడ ఎప్పటి నుండో వెంకటేష్ టిడిపి ఇన్చార్జిగా ఉంటున్నారు. అయితే వెంకటేష్ ఇన్చార్జిగా.

TDP

TDP

సరిగా వ్యహరించడం లేదని..పార్టీ బలహీన పడిందని ప్రచారం ఉంది. ఫలితంగా కొత్త ఇంచార్జ్ నీ నియమించాలని టిడిపి శ్రేణులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. 2014లో వెంకటేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ తరఫున 2014లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన వెంకటరమణ చౌదరి అనే నేత సినీ నటుడు … మురళీమోహన్ చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికలలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాగా గత ఏడాది మే నెలలో వెంకటరమణ చౌదరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఇటీవల వెంకటరమణనీ రాజానగరం ఇన్చార్జి గా చంద్రబాబు నియమించడం జరిగింది.

ఈ నియామకంతో పెందుర్తి వెంకటేష్ వర్గం.. అలగడం జరిగిందట. మరోపక్క ఎవరు ఇన్చార్జ్ అయితే వారే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం జరుగుతుంది. అయితే రాజానగరం నియోజకవర్గానికి ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీ తరఫున సేవలందిస్తున్న వెంకటేష్ తాజా.. వెంకటరమణ చౌదరిని ఇన్చార్జిగా నియమించడం పట్ల అసహనంగా ఉన్నట్లు టాక్. ఈ పరిణామంతో రాజానగరంలో రెండు వర్గాలుగా టిడిపి విడిపోయినట్లు జిల్లా రాజకీయాలలో ప్రచారం జరుగుతోంది.

Tags :

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది