Nadendla Bhaskara Rao : అప్పట్లో ఎన్టీఆర్… ఇప్పుడు పవన్… నాదెండ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?
Nadendla Bhaskara Rao : 1982లో అప్పటికి సినిమాల్లో ధ్రువతారగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని భావించి, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన వెన్నంటి ఉంది నాదెండ్ల భాస్కరరావు. అప్పట్లో టీడీపీలో నెంబర్ 2 నిలిచాడు. ఇప్పుడు సరిగ్గా నాదెండ్ల మనోహర్ కూడా సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నాడు. సీనియర్ నేతైనా నాదెండ్ల కు వైసీపీ, టీడీపీ నుండి ఆఫర్స్ వచ్చిన కానీ, వాటిని కాదనుకొని కొత్తగా వచ్చిన పవన్ వెనుక నడిచాడు.
అదే సమయంలో జనసేనాని కూడా నాదెండ్ల విషయంలో గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. పవన్ రాజకీయ పరంగా ఎక్కడికి వెళ్లిన కానీ పక్కనే నాదెండ్లను వెంటపెట్టుకొని వెళ్తున్నాడు. జనసేన లో నెంబర్ 2 స్థానం ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ది అనే చెప్పాలి. వీళ్ళ వాలకం చూస్తుంటే అప్పట్లో ఎన్టీఆర్, భాస్కరరావు ద్వయం గుర్తుకురాక మానదు. ఇక జనసేన కు ఎలాంటి అధికారం లేదు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా పెద్దగా కనిపించటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొగ్గ దశలోనే ఉంది జనసేన పార్టీ.
ఇలాంటి స్థితిలో నాదెండ్ల లాంటి సీనియర్ నేత అనుభవం చాలా అవసరం. ఆందుకే మనోహర్ ను పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నారు. పైగా ఆంధ్రాలో కమ్మ సామజిక వర్గం రాజకీయంగా బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నకాని రాజకీయంగా వెనకనే ఉన్నారు. దీనితో కమ్మ -కాపు కాంబినేషన్ లో రాజకీయాలు చేస్తే లాభం ఉంటుంది అనే కోణంలో కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల కలిసి పనిచేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో ఎన్టీఆర్ కి, ఇప్పుడు పవన్ కు చాలానే తేడా వుంది. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ బాగానే ఆరితేరాడు కాబట్టి రాజకీయంగా మనోహర్ తో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే శక్తి జనసేనాని ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. పైగా బాగా నమ్మదగిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అనే పేరు కూడా రాజకీయంగా వినిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్- మనోహర్ కాంబినేషన్ కు వచ్చిన ఢోకా ఏమి లేదనే చెప్పాలి. పైగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ బిజీ గా ఉన్నాడు. ఇలాంటి సమయంలో బాగా నమ్మకమైన, సీనియర్ అయిన నాదెండ్ల అవసరం పార్టీకి చాలానే ఉంది. అందుకే జనసైనికులు కూడా నాదెండ్ల విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.