Ycp : వైసీపీలో కోవ‌ర్టులు ఇంకా ఉన్నార‌నే దానిలో వాస్త‌వ‌మెంత‌.. ప‌చ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయ‌డం లేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ycp : వైసీపీలో కోవ‌ర్టులు ఇంకా ఉన్నార‌నే దానిలో వాస్త‌వ‌మెంత‌.. ప‌చ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయ‌డం లేదు..!

Ycp  : రాజ‌కీయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం.అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారి లోపాలు తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. అలానే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు అధికారంలో ఉన్న వారి లోపాల గురించి ఆరాలు తీసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.అయితే అలా తెలుసుకోవాల‌ని ఇటీవ‌లి కాలంలో కోవ‌ర్టులు వ‌చ్చారు. పార్టీతో మంచిగా ఉంటూనే సీక్రేట్స్ ప్రత్యర్ధి పార్టీలకు చేరవేయడం. వైసీపీ విషయానికి వస్తే కోవర్టుల బెడద ఆది నుంచి ఎక్కువే. ఎందుకంటే వైసీపీలో చేరిన వారు అంతా వేరే పార్టీల […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ycp : వైసీపీలో కోవ‌ర్టులు ఇంకా ఉన్నార‌నే దానిలో వాస్త‌వ‌మెంత‌.. ప‌చ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయ‌డం లేదు..!

Ycp  : రాజ‌కీయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం.అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారి లోపాలు తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. అలానే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు అధికారంలో ఉన్న వారి లోపాల గురించి ఆరాలు తీసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.అయితే అలా తెలుసుకోవాల‌ని ఇటీవ‌లి కాలంలో కోవ‌ర్టులు వ‌చ్చారు. పార్టీతో మంచిగా ఉంటూనే సీక్రేట్స్ ప్రత్యర్ధి పార్టీలకు చేరవేయడం. వైసీపీ విషయానికి వస్తే కోవర్టుల బెడద ఆది నుంచి ఎక్కువే. ఎందుకంటే వైసీపీలో చేరిన వారు అంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కావడంతో వారు పార్టీకి విధేయుల మాదిరిగానే ఉన్నారు.

Ycp  వారే కోవ‌ర్టులు..

అయితే రాను రాను ప‌రిస్థితులు మారాక వైసీపీ నుండి జారుకున్న వారి సంఖ్య పెరిగిపోయింది. వైసీపీలో చూస్తే ఎన్నికల ముందు నుంచి కూడా ఈ కోవర్టుల బెడద ఎక్కువగానే ఉంది అని ప్రచారం సాగింది. వీరంతా వైసీపీలో ఉంటూ అక్కడ ముఖ్యమైన సమాచారాని టీడీపీ కూటమికి ఎప్పటికపుడు చేరుస్తూ తాము ఉన్న పార్టీనే ముంచేశారు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఎన్నికలు అయ్యాయి. వైసీపీ ఓటమి పాలు అయింది. మరి ఇపుడు కూడా కోవర్టులు పార్టీలో ఉన్నారా అనే ప్ర‌చారం జ‌రుగుతుంది, ఇప్ప‌టికే జ‌గ‌న్ వారిని క‌నిపెట్టి బ‌య‌ట‌కు పంపించారు అనే టాక్ కూడా ఉంది. అయితే ఈ కోవర్టులను ఎలా గుర్తించడం అంటే అక్కడే చాలా తమాషాలు జరుగుతున్నాయి. వైసీపీలో పెద్ద నాయకులలో కొందరిని అసలు పచ్చ మీడియా అయితే పట్టించుకోవడం లేదు, వారిని టార్గెట్ కూడా చేయడం లేదు.

Ycp వైసీపీలో కోవ‌ర్టులు ఇంకా ఉన్నార‌నే దానిలో వాస్త‌వ‌మెంత‌ ప‌చ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయ‌డం లేదు

Ycp : వైసీపీలో కోవ‌ర్టులు ఇంకా ఉన్నార‌నే దానిలో వాస్త‌వ‌మెంత‌.. ప‌చ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయ‌డం లేదు..!

పచ్చ మీడియా వీరి మీద సాఫ్ట్ కార్నర్ తో ఉందీ అంటే వీరంతా టీడీపీ కూటమితో కుమ్మకు అయినట్లే అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. కొంత‌మందికి చుక్క‌లు చూపిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం వారిపై క‌న్నెత్తి చూడ‌డంలేదంటే వారంతా కోవ‌ర్టులుగా ఉన్నార‌ని ప‌లువురు ముచ్చ‌టించుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టే రకాలు కూడా ఉన్నాయి. వీరు కూడా పూర్తిగా వైసీపీ శిబిరాన్ని ఖాళీ చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారు. ఇంకొందరు అయితే పార్టీలో కేవలం ఉండేదే ఇలాంటి సమాచారం చేరవేసేందుకు అని అంటున్నారు. నేరుగా వెళ్ళి కూటమి తీర్ధం పుచ్చుకోకుండా ఇక్కడే ఉండి అక్కడకు మేలు చేస్తున్నారు అని జ‌నాలు ముచ్చ‌టించుకుంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది