Revanth Reddy : సీఎం అవ్వడానికి రేవంత్ రెడ్డి వేసిన సీక్రెట్ స్కెచ్ ఇదే ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : సీఎం అవ్వడానికి రేవంత్ రెడ్డి వేసిన సీక్రెట్ స్కెచ్ ఇదే ..!!

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటన వచ్చేసింది. హైకమాండ్ నుంచి రేవంత్ కు పిలుపు రావడం, ఎల్లా హోటల్ నుంచి ఆయన హుటాహుటిగా ఢిల్లీ వెళ్లారు. అప్పటికే ప్రోటోకాల్ అధికారులు ఆయనకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కానీ ఆయన సాదాసీదాగా తన ప్రైవేట్ వెహికల్ లోనే ప్రయాణించారు. రాత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. బుధవారం మల్లికార్జున కర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే క్యాబినెట్ తీర్పు […]

 Authored By anusha | The Telugu News | Updated on :6 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : సీఎం అవ్వడానికి రేవంత్ రెడ్డి వేసిన సీక్రెట్ స్కెచ్ ఇదే ..!!

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటన వచ్చేసింది. హైకమాండ్ నుంచి రేవంత్ కు పిలుపు రావడం, ఎల్లా హోటల్ నుంచి ఆయన హుటాహుటిగా ఢిల్లీ వెళ్లారు. అప్పటికే ప్రోటోకాల్ అధికారులు ఆయనకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కానీ ఆయన సాదాసీదాగా తన ప్రైవేట్ వెహికల్ లోనే ప్రయాణించారు. రాత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. బుధవారం మల్లికార్జున కర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే క్యాబినెట్ తీర్పు పై హై కమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఫుల్ క్లారిటీ తో ప్రకటన వచ్చేసింది. అయితే అంతా ఆషామాషీ కాదు. గచ్చిబౌలి ఎల్లా హోటల్ ఏకవాక్య తీర్మానం బదులు ఢిల్లీలో వేణుగోపాల్ ప్రకటన వరకు క్షణం క్షణం ఉత్కంఠ నెలకొంది. చర్చోపచర్చలు, ట్విస్ట్ లు సీనియర్లను తలపించాయి. సీఎం రేసులో రేవంత్ రెడ్డి తో పాటు మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి , శ్రీధర్ బాబు పేర్లు తెరపైకి వచ్చాయి .

హై కమాండ్ పిలుపుతో ఉత్తమ కుమార్, బట్టి విక్రమార్క తదితరులు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ ఎలా హోటల్లోనే ఉండిపోయారు. అటు హై కమాండ్ తో ఉత్తమ్, బట్టి తమ మనసులో మాట చెప్పారు. రెండుసార్లు పిసిసి ప్రెసిడెంట్ గా, రెండుసార్లు రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తాను సీఎం పదవిని ఆశిస్తున్నట్లు కుండ బద్దలు కొట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎల్పీ నేతగా, కాంగ్రెస్ వైస్ ను గెలిపించడం సహా పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసిన విషయాన్ని హైకమాండ్ దృష్టికి బట్టి విక్రమార్క తీసుకెళ్లారు. దళిత సీఎంగా బట్టికి ఛాన్స్ ఇస్తారని చర్చ జరిగింది. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని శ్రీధర్ బాబు సంకేతాలు ఇచ్చారు. గెలిచిన 65 మంది కూడా రేసులో ఉన్నవారే. అయినా హై కమాండ్ ఆదేశమే తమబాట అనే అంతా అన్నారు. ఫైనల్ గా రేవంత్ రెడ్డిని సీఎం చేశారు.

ఉత్తమ్, భట్టి సమక్షంలోనే కేసే వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలను వినడంతో పాటు సీఎం పదవిని ఆశించిన వాళ్లకు సంతృప్తి కలిగేలా హామీలు ఇచ్చినట్లు తెలుస్తుంది. పాత కొత్త కాదు అంతా ఒకే తాటిపై వెళ్లేలా కమాండ్ కంట్రోల్ ఉంటుందని భరోసా తోపాటు ప్రాధాన్యత కు తగినట్టుగా పదవులు ఉంటాయని హామీతో ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది అని టాక్. కాంగ్రెస్ అంటే కలహాలు మాత్రమే కాదు కంట్రోల్ కమాండ్ కూడా. టఫ్ కండిషన్లో హ్యాండిల్ చేయడం లో హైకమెండ్ దిట్ట అని మరోసారి ప్రూవ్ అయింది. అంతర్గత ప్రజాసౌమ్యానికి ఎంత ప్రాధాన్యత ఉన్నా చివరికి హై కమాండ్ ది ఫైనల్. ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, జానారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో దిగ్గజాల బలం అని అందరికీ తెలుసు. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం హై కమాండ్ బలం బలగం సోనియా రాహుల్ గాంధీ ప్రోత్సాహం వల్లే తాను నిటారుగా నిలబడి పోరాడానని రేవంత్ పదేపదే ప్రస్తావించారు. అందుకే రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది