Today Gold Price : ఏప్రిల్ 15 నేటి బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారు తప్పక తెలుసుకోండి
ప్రధానాంశాలు:
Today Gold Price : ఏప్రిల్ 15 నేటి బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారు తప్పక తెలుసుకోండి
Today Gold Price : ప్రతి రోజు బంగారం ధరలు Gold Rate మారుతుంటాయి. ఈ రోజు ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,550గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,754 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,163. నిన్నటితో పోలిస్తే పది గ్రాముల బంగారం ధరలో సుమారు రూ.10 మేర తగ్గుదల కనిపించింది. వెండి ధర కూడా కిలోకు రూ.100 మేర తగ్గింది.

Today Gold Price : ఏప్రిల్ 15 నేటి బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారు తప్పక తెలుసుకోండి
బంగారం స్వచ్ఛతను క్యారెట్ల ప్రకారం కొలుస్తారు. 24 క్యారెట్లు అంటే ఇది 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం, ఇది సాధారణంగా బార్స్, బిస్కెట్లు, కాయిన్స్ రూపంలోనే లభిస్తుంది. నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. అందుకే దీన్ని 916 గోల్డ్ అని కూడా అంటారు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ మారకపు విలువ ఆధారంగా మారుతుంటాయి.
బంగారం కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని చోట్ల పన్నులు, సుంకాలు చేర్చకుండా తక్కువ ధరలు చూపించవచ్చు. కానీ బిల్లు వేయించేటపుడు మొత్తం ధర పెరిగిపోతుంది. అలాగే బిల్లు లేకుండా కొనుగోలు చేస్తే నాణ్యతపై భరోసా ఉండదు, మరమ్మతులు, మార్పిడులపై కూడా వ్యాపారులు బాధ్యత వహించరు. అందుకే బంగారం కొనేటప్పుడు బిల్లుతో పాటు హాల్‌మార్క్ నాణ్యతను తప్పక చెక్ చేయడం అత్యంత అవసరం.