Today Top Telugu Breaking News : ఉత్తరాఖండ్ సొరంగం నుంచి అందరూ క్షేమం.. రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర.. పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి కాంస్య పతకం.. తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చే వారికి ఓటు వేయకండన్న జయప్రకాశ్

Today Top Telugu Breaking News : ఉత్తరాఖండ్(Uttarakhand Tunnel Rescue) లోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న కూలీలందరినీ అధికారులు రక్షించారు. 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో(India vs Australia Third T20) భారత్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ గా రుతురాజ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 57 బంతుల్లో 13 ఫోర్లు, 7  సిక్సులు బాది 123 పరుగులు చేశాడు.

టాలీవుడ్ నటి ప్రగతి(Tollywood Actress Pragathi) జాతీయ పవర్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం సాధించారు. బెంగళూరులో జరిగిన 28వ నేషనల్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో మూడో స్థానంలో నిలిచింది.

డబ్బంతా కేవలం తాత్కాలిక అవసరాలకే ఖర్చు పెట్టి రేపు ఏం లేకుండా చేసేవాళ్లు ఖచ్చితంగా మన భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతారని.. తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చే వారికే ఓటు వేయాలని మాజీ ఐఏఎస్, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) అన్నారు. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడానికి ఎవరు దోహదం చేస్తున్నారో వారికే ఓటు వేయాలన్నారు.

అప్పుల భారంతో ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) మండిపడ్డారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.

తెలంగాణలో ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) ఉన్న నేపథ్యంలో నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా బస్ పాస్ కేంద్రాలకు టీఎస్ఆర్టీసీ(TSRTC) సెలవు ప్రకటించింది.

తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాల్ కృష్ణ(AP Minister Venugopal Krishna) డిశ్చార్జ్ అయ్యారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఏపీకి చెందిన ఇందరు ఐఏఎస్ అధికారులు(IAS Officers) హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. తమ ఆదేశాలను ధిక్కరించారని ఐఏఎస్ లు శ్యామలరావు, పోలా భాస్కర్ లకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) బరిలో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నవంబర్ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

2024 టీ20 వరల్డ్ కప్(T20 world cup 2024) కు నమీబియా జట్టు అర్హత సాధించింది. మొత్తం 19 జట్లు ఇప్పటి వరకు క్వాలిఫై అయ్యాయి. తాజాగా నమీబియా(Namibia) చోటు సంపాదించుకుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago