Kadakuntla Gangaram : బీడీ కార్మిక సంఘ నాయకుడు కడకుంట్ల గంగారం కి ఘన నివాళులు
ప్రధానాంశాలు:
Kadakuntla Gangaram : బీడీ కార్మిక సంఘ నాయకుడు కడకుంట్ల గంగారం కి ఘన నివాళులు
Kadakuntla Gangaram : చంద్ర న్యూస్ : కమ్యూనిస్టు పార్టీ నేత కార్మిక సంఘ నాయకుడు స్వర్గీయ కామ్రేడ్ కడకుంట్ల గంగారం బీడీ కార్మికుల హక్కుల కోసం సంక్షేమం కోసం పోరాడి సాధించిన హక్కులు స్థిర స్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు తేదీ 25 ఫిబ్రవరి 25 మంగళవారం రోజున కామ్రేడ్ కడకుంట్ల గంగారం 33వ వర్ధంతి సభ సందర్భంగా సి.ప్రభాకర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నేతలు మాట్లాడుతూ 1992 సంవత్సరం పూర్వం బీడీ కార్మిక సంఘం 1963 లో కార్మికుల కూలి వేతనాలు పెంపు తో పాటు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ బోనస్, కరువు బత్యం కావాలని సి. ప్రభాకర్ తో సమానం కలిసి పని చేశారని వివరించారు .

Kadakuntla Gangaram : బీడీ కార్మిక సంఘ నాయకుడు కడకుంట్ల గంగారం కి ఘన నివాళులు
అంతేకాకుండా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేపట్టి ఎంతో మంది పేదలకు ఇండ్లు ఇప్పించారని బీడీ కార్మిక దవఖాన నెలకొల్పారని అన్నారు చేనేత కార్మికులకు సహకార సంఘం నెలకొల్పి వారి హక్కుల కోసం వేతనాల కోసం సంక్షేమం కోసం నిరంతరం పోరాడారని మరియు కోరుట్ల పట్టణంలో మొట్టమొదటిసారిగా సూపర్ బజార్ ఏర్పాటు చేసి పేదలందరికీ బియ్యం,చక్కెర గోధుమలు, కిరోసిన్ లాంటి నిత్యవసర వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఇచ్చారని పేర్కొన్నారు సూపర్ బజార్ కు రెండుసార్లు అధ్యక్షులుగా పని చేశాడని అలాగే కోరుట్ల గ్రామ సర్పంచు ఎన్నికలలో పోటీ చేసి సమీప అత్యధిక కేవలం 11 ఓట్లతో వెనుకబడ్డాడని అయినా ఆత్మ సైరన్ తో కొన్ని వార్డులు గెలిపించుకున్నారని అంతేకాకుండా మండలంలోని యూసుఫ్ నగర్ సర్పంచ్గా మెట్టుపల్లి లోని వెల్లుల్ల సర్పంచ్ గా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ సర్పంచ్ గా వారి హాయంలోనే గెలిచారని వివరించారు.
అలాంటి మహోన్నత వ్యక్తి లేని లోటు భారత కమ్యూనిస్టు పార్టీకి కార్మిక వర్గానికి తీరనిలోటని వారి ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు కార్మిక సంఘ గల నేతలు ఐకమత్యంతో ముందుకు సాగాలని వివరించారు ఈ వర్ధంతి సభలో సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు చెన్న విశ్వనాథం మాజీ కౌన్సిలర్ మౌలానా బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్నం రాధా, సాంబార్ మహేష్, రాస భూమయ్య,కొక్కుల గంగాధర్,అందే వంశీకృష్ణ, ఎండి సమీర్, ఎన్నం రాజు, రాస గీత, క్యాతం సహా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
-కోరుట్ల డివిజన్ రిపోర్టర్ సాంబార్ మహేష్