TSRTC MD Sajjanar : 100 మంది మహిళలు కలిసి పెళ్ళికి వెళ్ళవచ్చా .. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..!
ప్రధానాంశాలు:
TSRTC MD Sajjanar : 100 మంది మహిళలు కలిసి పెళ్ళికి వెళ్ళవచ్చా .. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..!
TSRTC MD Sajjanar : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీ లను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహిళల ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని ఈరోజు నుంచి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈరోజు నుంచి తెలంగాణ పరిధిలో టీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలా అని 50,100 మంది ఆడవాళ్లు కలిసి ఎక్కడికైనా వెళ్లాలని బస్ బుక్ చేసుకుంటే ఫ్రీగా ఇచ్చే అనుమతి లేదని, సింగిల్గా వెళ్లే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ తెలిపారు.
అలాగే ప్యాకేజ్ సర్వీస్ కి, టూర్ సర్వీస్ కి ఈ పథకం వర్తించదు అని అన్నారు. ఈ పథకం కోసం ఆర్టీసీ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వేరే రాష్ట్రానికి వెళ్లాలంటే అక్కడ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మొదటి వారంలో ఎలాంటి ఐడెంటి కార్డు లేకుండానే ప్రయాణం చేయొచ్చు. ఉచిత బస్సు ప్రయాణం డిసెంబర్ 9 నుంచి ప్రారంభం చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతి బస్సులో మహిళ ప్రయాణికుల సంఖ్యను కండక్టర్లు విధిగా వివరాలు రాసుకోవాలి.
వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన గృహలక్ష్మి పథకాన్ని ఈరోజు అమలు చేశారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9న మధ్యాహ్నం 1:30 కు అసెంబ్లీ ప్రాంగణంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి పథకం అమలుకు జీవో కూడా జారీ చేశారు. కాగా ఈ పథకానికి సంబంధించిన వివరాలను, నిబంధనలను వీసీ సజ్జనార్ వివరించారు.