TTD : తిరుమ‌లకి వెళ్లే రాజ‌కీయ నేత‌లు జ‌ర‌భ‌ద్రం.. టీటీడీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TTD : తిరుమ‌లకి వెళ్లే రాజ‌కీయ నేత‌లు జ‌ర‌భ‌ద్రం.. టీటీడీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 November 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  TTD : తిరుమ‌లకి వెళ్లే రాజ‌కీయ నేత‌లు జ‌ర‌భ‌ద్రం.. టీటీడీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా..!

TTD  : తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌గా మారుతుంది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మికత వాతావరణాన్ని దెబ్బతీసేలా పొలిటికల్ కామెంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. తిరుమలకు వచ్చిన పలువురు రాజకీయ నాయకులు దర్శనం తర్వాత మీడియాతో రాజకీయ విమర్శలు చేస్తున్నారని టీటీడీ తెలిపింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందంది.ఈ క్ర‌మంలో పొలిటికల్ లీడర్స్‌ను టీటీడీ నిర్ణయం ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పొలిటికల్ లీడర్లు చానళ్లతో ఇప్పటివరకు రాజకీయ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వచ్చారు.

TTD తిరుమ‌లకి వెళ్లే రాజ‌కీయ నేత‌లు జ‌ర‌భ‌ద్రం టీటీడీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా

TTD : తిరుమ‌లకి వెళ్లే రాజ‌కీయ నేత‌లు జ‌ర‌భ‌ద్రం.. టీటీడీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందిగా..!

TTD  జ‌ర జాగ్రత్త‌..

రాజకీయ నాయకులు తిరుమలను దర్శించుకున్న అనంతరం చేస్తున్న పొలిటికల్ వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. దీంతో టీటీడీ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇకపై తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలను పూర్తిగా నిషేధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే.. తిరుమలకు వచ్చిన వారికి మరింత ప్రశాంతత కల్పించేలా కొత్త బోర్డు ఈ విధంగా ఆలోచించింది. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంపై ఈ రాజకీయ ప్రసంగాలతో వాతావరణం చెడిపోతున్నదని బోర్డు భావించింది.

రాజకీయ నాయకులు వారి నోటికి ప‌ని చెబుతుండ‌డం కొంద‌రిని ఇబ్బంది పెడుతుంది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటున్నదని టీటీడీ భావించింది. అందుకే.. ఇక నుంచి రాజకీయ ప్రసంగాలకు చెక్ పెట్టాలని బోర్డు ఇటీవల తీర్మానించింది. ఇందులో భాగంగా ఇకపై తిరుమలకు వచ్చే పొలిటికల్ లీడర్స్ రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రసంగాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. అలాంటి ప్రసంగాలకు దూరం ఉండాలని అభ్యర్థించింది. సిబ్బంది కూడా వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పొలిటికల్ లీడర్లు బీ అలర్ట్.. తిరుమలకు వెళ్లి మునుపటిలా రాజకీయ ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి అని నెటిజన్లు సూచిస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది