Undavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవికి బ్యాడ్ న్యూస్.. టీడీపీ నుంచి నో టికెట్.. మళ్లీ వైసీపీలోకి?
ప్రధానాంశాలు:
ఉండవల్లి శ్రీదేవికి ఈసారి టికెట్ దక్కేనా?
ఎందుకు చంద్రబాబు ఈసారి ఉండవల్లికి టికెట్ ఇవ్వడం లేదు?
ఉండవల్లి నిజంగా గెలిచే అవకాశం లేదా?
Undavalli Sridevi : 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకతోట చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ ఇద్దరూ ఎలాగూ టీడీపీలో చేరిపోయారు కానీ.. వీళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా అనేదే పెద్ద డౌట్ గా మారింది. ఈ ఇద్దరితోనే ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేశారు. వీళ్లు టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయడంతో వాళ్లు అఫిషియల్ గా టీడీపీలో చేరినట్టే అని స్పష్టం అయింది. తాజాగా వాళ్లు టీడీపీలో చేరినప్పటికీ.. ఉండవల్లికి టికెట్ ఇస్తారా అనేది పెద్ద డౌటే. మేకతోట చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పటికే టికెట్ కన్ఫమ్ అయింది కానీ.. ఉండవల్లి శ్రీదేవికి మాత్రం టికెట్ రావడం కష్టమే అనిపిస్తోంది.
ఎందుకంటే.. చంద్రబాబు ఇప్పటికే రాబిన్ శర్మ టీమ్ తో సర్వే చేయిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ నేతకు బలం ఉంది.. అనేది ముందే తెలుసుకుంటున్నారు. ఆ రాబిన్ శర్మ టీమ్ ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇవ్వొద్దని చెబుతోంది. చంద్రబాబు పర్సనల్ సర్వే కూడా అదే చెప్పింది. ఆమె ఏ పార్టీ నుంచి టికెట్ పొందినా.. ఆమెను అక్కడ అభ్యర్థిగా ప్రకటించవద్దని రాబిన్ శర్మ టీమ్ చెప్పిందట. లోకల్ గా ఆమె వల్ల పార్టీకి ఒరిగేది ఏం లేదు కానీ.. ఆమెను ఎన్నికల ప్రచారం కోసం మాత్రం ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Undavalli Sridevi : ఉండవల్లికి బీ ఫామ్ ఇవ్వడం కష్టమే
ఉండవల్లి శ్రీదేవికి బీ ఫామ్ ఇచ్చే చాన్స్ అయితే లేదని చంద్రబాబు చెబుతున్నారట. కాకపోతే తనను ఎన్నికల ప్రచారం కోసం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఉండవల్లి శ్రీదేవి అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోబోతున్నారు. మరి.. చంద్రబాబు నిర్ణయానికి ఉండవల్లి కట్టుబడి ఉంటారా? లేక మరే నిర్ణయమైనా తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.