Uttam Kumar Reddy : రేవంత్ సారథ్యంలో 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విక్టరీ.. తేల్చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Advertisement

Uttam Kumar Reddy : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం కానీ.. ఏ పార్టీకి ఆ పార్టీ.. తామే గెలుస్తామని గప్పాలకు పోతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ అయితే గెలుపు పక్కా అని భావిస్తోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఏ పార్టీ ఏం మాట్లాడుతోంది అనేది పక్కన పెడితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపుపై అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisement
uttam kumar reddy says about congress victory in telangana
uttam

ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుటా ఎగురువేసింది. అదే ఊపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఆరు గ్యారెంటీ స్కీమ్ లను సోనియా గాంధీ సభ వేదికగా ప్రకటించారు.

Advertisement

Uttam Kumar Reddy : ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు పక్కా

నాకు ఉన్న రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు పక్కా. అది కూడా 70 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నేను ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఒకసారి ఎంపీగా గెలిచా. మంత్రిగా చేశా.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలపు ఖాయం అయిపోయింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. అంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందే ప్రకటించేశారు. మరి.. నిజంగానే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Advertisement
Advertisement