Chandrababu : అరెస్టు చేసిన తర్వాత ఫస్ట్ టైం మీడియాతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : అరెస్టు చేసిన తర్వాత ఫస్ట్ టైం మీడియాతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వీడియో..!!

Chandrababu : ఏపీ సీఐడీ పోలీసులు తనని అరెస్టు చేయడం పట్ల చంద్రబాబు ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేసి తనని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు సమాధానం ఇవ్వలేదని మీడియాతో పేర్కొన్నారు. వీళ్ళు నన్ను అరెస్టు చేసే విధానం చూసి చాలా బాధేస్తుంది. ఈ సమయంలో ప్రజలందరికీ.. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న.. నాలుగున్నర సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నా. ప్రజా సమస్యలపై పోరాడుతున్న, ఇటువంటి సమయంలో నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని […]

 Authored By sekhar | The Telugu News | Updated on :9 September 2023,9:20 pm

Chandrababu : ఏపీ సీఐడీ పోలీసులు తనని అరెస్టు చేయడం పట్ల చంద్రబాబు ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేసి తనని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు సమాధానం ఇవ్వలేదని మీడియాతో పేర్కొన్నారు. వీళ్ళు నన్ను అరెస్టు చేసే విధానం చూసి చాలా బాధేస్తుంది. ఈ సమయంలో ప్రజలందరికీ.. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న.. నాలుగున్నర సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నా. ప్రజా సమస్యలపై పోరాడుతున్న, ఇటువంటి సమయంలో నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని దురుద్దేశంతో వ్యవహరించటం చాలా బాధాకరం.

ఓ ప్రణాళిక ప్రకారం ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా తనని అడ్డుకునే రీతిలో.. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 9 శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబుని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు ఆయన కాన్వాయ్ లోనే విజయవాడకి తరలించడం జరిగింది. చంద్రబాబు అరెస్టు న్యాయపద్యంలో చిలకలూరిపేట మరికొన్ని ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య చంద్రబాబుని తీసుకెళ్లడం జరిగింది.

video of chandrababu comments to first time media after his arrest

video of chandrababu comments to first time media after his arrest

చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబుని చట్టప్రకారం అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదంతా కక్ష సాధింపు చర్యలలో భాగమేనని.. కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ పేర్కొన్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది