Vijayashanti : టాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్లలో ముఖ్యమైన వాళ్లలో ఒకరైన చిరంజీవి, విజయశాంతి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చిరంజీవి విజయశాంతితో కలిసి 25 సినిమాలలో నటించారు.ఆ రోజుల్లో వీళ్ళిద్దరి జంట కు విపరీతమైన అభిమానులు ఉండేవారు. అలాగే సినీ దర్శకులు, నిర్మాతలు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాలు తీసి డబ్బు సంపాదించుకోవాలని చూసేవారు. ఇక చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన చివరి సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలైతే ఇక లేవు. విజయశాంతి హీరోయిన్ అయినప్పటికీ హీరోలతో సరి సమానంగా సినిమాలలో పాత్రలను సంపాదించుకుంది. చిన్న హీరోలతో కాదు మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలలో ఆమె కంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను సంపాదించుకునే స్థాయికి వచ్చారు.
అంతేకాకుండా చిరంజీవితో పోటాపోటీగా సినిమాలలో నటించేవారు. వీళ్లిద్దరికే కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉండేది. వీళ్ళిద్దరూ కలిసి చేసిన కామెడీ, రొమాన్స్, డాన్స్ ప్రతిదీ అందరినీ ఆకట్టుకునేది. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో విజయశాంతి ఎంత ధీటుగా, ఎంతో సక్సెస్ఫుల్గా నటిస్తారని మనందరికీ తెలుసు. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన సినిమాలు కర్తవ్యం, ప్రతిఘటన గొప్ప పేరును తీసుకొచ్చాయి. దాసరి నారాయణ దర్శకత్వంలో ఒసేయ్ రాములమ్మ సినిమా తర్వాత విజయశాంతి క్రేజ్ హీరోలను మించిపోయింది. ఆమె రెమ్యూన౦రేషన్ కూడా స్టార్ హీరోలకు సైతం మించిపోయిందట. కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి విజయశాంతి ఎదిగారు.
అయితే ఆమె సినిమాల నుంచి చిన్నగా రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో సినిమాలకు దూరం అయిపోయారు. చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. ఆ సినిమా టైం లోనే చాలా ఏళ్ల తర్వాత చిరంజీవిని విజయశాంతి కలిశారు. రాజకీయంలోకి వెళ్ళటం వలన తనతో ఎవరు టచ్ లో లేరని అన్నారు. ఇక గతంలో విజయశాంతి చిరంజీవి తెలంగాణ రాష్ట్రం కోసం సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించడం లేదని, అందరూ ముసుకు దొంగలే అని వ్యాఖ్యానించారు. ఇక రాజకీయపరంగానే అలాంటి కామెంట్స్ చేశానని చిరంజీవికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని విజయశాంతి చెప్పారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.