Revanth Rddy : ఇంకోసారి గుంపు మేస్త్రి అంటే గుణపం దింపుతా… సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

Revanth Rddy : తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీను ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే,చేస్తానని హామీ ఇచ్చిన పథకాలను నెరవేర్చాలంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. అయితే బిఆర్ఎస్ నేతలు చేసే విమర్శలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ నేపథ్యంలోనే ఓ సభలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. అయితే ఇవాల్టికి అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కావడం లేదు. అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతున్నారు. అయితే ఇంతకుముందే నా మిత్రుడు కొండ ప్రభాకర్ రావు గారు నాకు చెప్పారు మనం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆడబిడ్డల కోసం మొదలుపెట్టినమో ఇప్పటివరకు పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అని చెప్పిండు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణించే విధంగా సౌకర్యం కల్పించినందుకు ప్రతి ఒక్కరూ కూడా సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాము. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరిి అభిమానంతో మరో రెండు పథకాలను అమలులోకి తీసుకురావడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సన్నాసులారా మీరా మమ్మల్ని అడిగేది…3650 ,రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మీరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు.. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు. గిరిజనులకు కూడా 12 శాతం రిజర్వేషన్ కల్పించలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి ఏమీ చేయని సన్నాసులు ఈరోజు మేము ఏమి చేయట్లేదు అంటున్నారా…మీకేం అర్హత ఉంది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు.ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీపించారు.7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు..ఈరోజు ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు లాగా చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎలాంటి బడ్జెట్ లేదు. అయినా కూడా బట్టి అన్న ఏదో రకంగా చేసి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కూడా జీతాలు ఆపలే , అలాగే పేదలకు జరిగే సంక్షేమ పథకాలు ఆపలేదు. రైతుబంధు పథకం ఆపలే.

కానీ ప్రతి సన్నాసి ఇంకా రైతుబంధు పడలేదు అంటున్నారు. గత సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు రైతుబంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 6లోపు మొత్తం రైతుబంధు పథకాన్ని పూర్తిచేసే బాధ్యత మనది. మీ అభిమానం తోటి ఫిబ్రవరి ఆఖరి రోజు కల్లా ఈ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు రైతుబంధు నగదు బ్యాంకులలో పడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రజలారా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి , మరోవైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనమంతా కూడా సరిదిద్దాలి.. ఇంకొక మాట అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటున్నారు. అవును బిడ్డ నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్ నిర్మించే మేస్త్రిని నేను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎఫ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు .

Share

Recent Posts

Chandrababu : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, అమరావతి పేరు తోపాటు, కేబినెట్ ప‌లు నిర్ణ‌యాలు..!

Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…

4 hours ago

YS Jagan : పేర్లు రాసుకోండి… వారికి సినిమా చూపిస్తామంటూ జ‌గ‌న్ వార్నింగ్..!

YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…

5 hours ago

Modi : మోదీ స‌ర్కార్ స‌రికొత్త పాల‌సీ.. స‌క్సెస్ కి కార‌ణం ఇదే…!

Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. హింసను వదులుకోవడానికి…

6 hours ago

Pakistan Youth : భార‌త్ సైన్యాన్ని ఆకాశానికి ఎత్తుతున్న పాక్ యువ‌త‌.. ఆ కిక్కే వేర‌ప్పా..!

Pakistan Youth : జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భార‌త సైన్యం…

7 hours ago

Samantha : స‌మంత లీక్ చేసిందా.. కాబోయే భ‌ర్త ఇత‌నే అంటూ ప్ర‌చారాలు..!

Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవ‌రిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్ర‌చారాలు జోరుగా…

8 hours ago

Pakistan : పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు.. పాక్ కు చుక్క‌లు చూపిస్తున్న భారత్

Pakistan : పాక్‌కు భారత్ చుక్క‌లు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…

9 hours ago

Realme 14 Pro Plus : బంప‌ర్ ఆఫ‌ర్.. రూ.32వేల రియల్‌‌మి ఫోన్ కేవలం రూ. 12వేల క‌న్నా త‌క్కువా?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల‌లో ఒక్కోసారి బంప‌ర్ ఆఫ‌ర్స్ పెడుతుంటారు. వాటి వ‌ల‌న కాస్ట్‌లీ ఫోన్స్ కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కి లభిస్తుంటాయి…

11 hours ago

Summer : వేస‌విలో ఈ చిన్న‌పాటి జాగ్ర‌త్త‌లు పాటిస్తే అంతా హాయే

Summer  : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…

12 hours ago