VIP Prisoners : తీహర్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడపటం సాధ్యమేనా…కేజ్రీవాల్ , కవిత జీవితం ఎలా ఉండబోతుంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

VIP Prisoners : తీహర్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడపటం సాధ్యమేనా…కేజ్రీవాల్ , కవిత జీవితం ఎలా ఉండబోతుంది..?

VIP Prisoners : తీహార్ జైల్లో వీఐపీ ల జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే జైళ్లు అనేవి ఎలా ఉంటాయో మనం చాలాసార్లు చూసాం. ఇక రాజకీయ నాయకులు అయితే జైల్లో వారికి నచ్చినట్లుగా మసాజ్ లు చేపించుకుంటూ ,ఇష్టమైన ఆహారం తెప్పించుకుంటూ, ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ సినిమాల్లో సీరియల్స్ లో మాత్రమే జరుగుతాయి. తీహార్ జైల్లో మాత్రం ఇలాంటివి ఏమీ ఉండవని చెప్పాలి.మనం చూసినట్లుగా అక్కడ అలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  VIP Prisoners : తీహర్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడపటం సాధ్యమేనా...కేజ్రీవాల్ , కవిత జీవితం ఎలా ఉండబోతుంది..?

VIP Prisoners : తీహార్ జైల్లో వీఐపీ ల జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే జైళ్లు అనేవి ఎలా ఉంటాయో మనం చాలాసార్లు చూసాం. ఇక రాజకీయ నాయకులు అయితే జైల్లో వారికి నచ్చినట్లుగా మసాజ్ లు చేపించుకుంటూ ,ఇష్టమైన ఆహారం తెప్పించుకుంటూ, ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ సినిమాల్లో సీరియల్స్ లో మాత్రమే జరుగుతాయి. తీహార్ జైల్లో మాత్రం ఇలాంటివి ఏమీ ఉండవని చెప్పాలి.మనం చూసినట్లుగా అక్కడ అలా ఉండదు. తీహార్ జైలుకు ఎమ్మెల్యే వచ్చిన సెలబ్రిటీలు వచ్చిన బిగ్- క్లాస్ సౌకర్యాలు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవు. అంటే ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ఎవరికైనా సరే ఒకే రకమైన సౌకర్యాలను తీహార్ జైళ్లో కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా తీహార్ జైలు కి పంపించారు. ఆయన ఢిల్లీ సీఎం కాబట్టి ఆయనకి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అని చాలామంది అనుకుంటారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

VIP Prisoners : జైలు నుండే ప్రభుత్వాన్ని నడిపిస్తా…

అయితే తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడిపిస్తాను అని అన్నారు. ఇప్పుడు వస్తున్నా వార్తల ప్రకారం తీహార్ జైలు నుండే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే జైలు నుంచి పరిపాలన నడపడం అనేది అంత సులువైన విషయం కాదు. దానికోసం చాలా రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది.అలాగే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపే సదుపాయం ఇంతవరకు ఆచరణలో లేదు. క్యాబినెట్ మీటింగ్స్ , పబ్లిక్ ని కలవడం , గవర్నర్ తో మాట్లాడటం వంటివి అసలే కుదరవు. ఇలాంటి సమయంలో ఫోన్ కూడా ఉండదు. అలాగే సీఎం కోసం ఆఫీసును నిర్వహించడం కూడా కుదరని పని. మరి ఇలాంటి సందర్భంలో కేజ్రీవాల్ తీహర్ జైలు నుంచి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారు అనేది పెద్ద ప్రశ్న.

VIP Prisoners తీహర్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడపటం సాధ్యమేనాకేజ్రీవాల్ కవిత జీవితం ఎలా ఉండబోతుంది

VIP Prisoners : తీహర్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడపటం సాధ్యమేనా…కేజ్రీవాల్ , కవిత జీవితం ఎలా ఉండబోతుంది..?

ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. బయట జీవితం కంటే తీహార్ జైల్లో భిన్నమైన అనుభూతి కలుగుతుంది. తీహార్ జైలు లోపలికి వెళితే ఎన్నో హృదయాలు కదిలే విషయాలు తెలుస్తాయి. హత్యలు చేసి వచ్చిన వాళ్ళు, దొంగతనం చేసి దొరికిన వాళ్ళు, అలాగే డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన వారు ఇలా ఎన్నో నేరాలు చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. అలాంటి ఈ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చారు.ఇక ఈ జైల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే సాధారణ ఖైదీల మాదిరిగానే రాజకీయ నాయకులను కూడా చూస్తారట. అంతెందుకు ఇటీవల కల్వకుంట్ల కవిత అరెస్టు అయి తీహార్ జైలుకు వెళ్లారు. కానీ అక్కడ ఆమెకు కోర్టు ఆదేశించిన కనీస సదుపాయాలను కూడా జైలు అధికారులు కల్పించలేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించడం లేదు అంటే ఆ జైల్లో అధికారులు ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుంది. మరి ఇలాంటి తీహార్ జైలు నుండి కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారో చూడాలి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది