YS Jagan : వాలంటీర్ల కార్యక్రమంలో జగన్ సూపర్ హ్యాపీ – ఏం జరిగిందో చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : వాలంటీర్ల కార్యక్రమంలో జగన్ సూపర్ హ్యాపీ – ఏం జరిగిందో చూడండి !

YS Jagan : అది జగన్ పాలన అంటే. అలా ఉంటది మరి. వాలంటీర్ల వల్లనే ప్రస్తుతం సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. అందరి కంటే ముందే వాలంటీర్లు మేల్కొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. అందుకే వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 33 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్లకు వందనం పేరుతో పలు కేటగిరీలో బహుమతులను […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 May 2023,10:00 am

YS Jagan : అది జగన్ పాలన అంటే. అలా ఉంటది మరి. వాలంటీర్ల వల్లనే ప్రస్తుతం సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. అందరి కంటే ముందే వాలంటీర్లు మేల్కొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. అందుకే వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 33 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్లకు వందనం పేరుతో పలు కేటగిరీలో బహుమతులను కూడా సీఎం జగన్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న 25 రకాల సంక్షేమ పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని అన్నారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అసలు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి, సారథులు వాళ్లే అని సీఎం జగన్ ఉటంకించారు.

YS jagan governments good news for village and ward volunteers will be implemented from this month

YS jagan-governments-good-news-for-village-and-ward-volunteers-will-be-implemented-from-this-month

YS Jagan : ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించిన జగన్

2019 నుంచి ఇప్పటి వరకు 2 లక్షలకు పైనే వాలంటర్లు ఏపీలో పని చేస్తున్నారని.. వాళ్లకు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సారథుల్లా ఉన్నారన్నారు. వాళ్లే సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు వైసీపీ ప్ఱభుత్వం చేసే మంచి పనికీ, ప్రతి సంక్షేమ పథకానికి, ప్రతి మేలుకు వాళ్లే సారథులు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారానే సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. తులసి మొక్క లాంటి వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ. మీరు ఈ ప్రభుత్వంలో సేవ మాత్రమే చేస్తున్నారు. నిజాలు చెప్పగలిగే సాయుధులు మీరు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. స్వచ్ఛంద సేవకులు అని సీఎం జగన్ కొనియాడారు.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది