Voter Slip : ఓటర్ స్లిప్ లేకపోయినా ఓటు వేయండి ఇలా..!
ప్రధానాంశాలు:
Voter Slip : ఓటర్ స్లిప్ లేకపోయినా ఓటు వేయండి ఇలా..!
Telangana తెలంగాణలో ఎన్నికల ఫీవర్
Voter Slip : తెలంగాణలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. అసెంబ్లీ స్థానాల కోసం ఇరుపక్షాల పార్టీలు గట్టి పోటీ పడుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అని యుద్ధం చేస్తుంది. ఇప్పటికే అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాయి. ఇక ఈ ప్రచారం ఈనెల 28న ముగియనుంది. 30వ తారీఖున పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా ఫైనల్ అయింది. ఇక ఓటు వేయడానికి కీలకమైన ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది.
అయితే ఓటర్ల స్లిప్పులు అందని వారు ఓటు ఎలా వేయాలని కంగారు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓటర్ల సందేహాలను తొలగించడానికి ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పును అందజేసింది. ఈ ప్రక్రియ ఈనెల 25న ముగిసింది. అయితే ఇంకా ఓటర్ స్లిప్పులు అందని వారు కూడా ఉన్నారు. ఓటర్ స్లిప్పు లేకపోయినా జాబితా పేరు ఉంటే ఓటు వేసే అవకాశం ఉంటుంది. గుర్తింపు కార్డుతో ఓటు వేయడానికి అనుమతి ఇస్తారు.
ఓటర్ స్లిప్పును ఎన్నికల వెబ్ సైట్లో పొందే అవకాశం ఉంది. డొమైన్లోకి వెళ్ళగానే వెంటనే ఓటర్ వివరాలు, సీరియల్ నెంబర్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ సమయం, పోలింగ్ స్టేషన్ నెంబర్ తదితర వివరాలు డిస్ప్లే అవుతాయి. ఓటర్ నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ సాయంతో స్లిప్పును పొందవచ్చు. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకోవాలి. ఇది లేదంటే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఎన్ఆర్‌ఈజీఎస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చు.