YS Viveka Murder : ఆవిడతో అఫైర్ కారణంగానే వివేకా మర్డర్ జరిగిందా? వామ్మో బిగ్ న్యూస్ ఇది..!
YS Viveka Murder : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఆ కేసు తెలంగాణకు పాకింది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం వైఎస్ వివేకా మర్డర్ కేసుపై విచారణ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. కానీ.. వైఎస్ అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదులు మాత్రం కావాలని అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అసలు నిందితుల విషయంలో వివేకా కూతురు సునీత ఎందుకు మౌనంగా ఉంటోందని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
అయితే.. వైఎస్ వివేకానంద రెడ్డి.. సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధింపులకు గురి చేశారని, దానిపై కక్ష కట్టిన సునీల్ యాదవ్.. వైఎస్ వివేకానందను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సునీల్ యాదవ్ కుట్ర చేయడంతో దస్తగిరి వివేకాను హత్య చేశారని న్యాయవాదులు తెలిపారు. ఇక్కడ దస్తగిరి, సీబీఐ, వైఎస్ వివేకానంద కుమార్తె సునీత ముగ్గురు ఒక్కటయి..
YS Viveka Murder : దస్తగిరి, సీబీఐ, వైఎస్ వివేకా కూతురు ముగ్గురు ఒక్కటయ్యారు
వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. అయితే.. ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని, కావాలని టీడీపీ నేతలు కడప ఎంపీని ఇరికించాలన చూస్తున్నారని తెలిపారు. అలాగే.. తన రెండో భార్య కొడుకే తన రాజకీయ వారసుడు అని వివేకా ప్రకటించడంతో అక్కడ కుటుంబ విభేదాలు కూడా తలెత్తాయని అన్నారు. అసలు నేరస్తులను వదిలేసి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం సీబీఐ చేస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాదులు అన్నారు.