తెలుగుదేశం నేతలతో అల్లూ అర్జున్ కి ఏం పని ? భారీ వీడియో బయటపడింది !

Authored By Breaking News | The Telugu News | Published on: July 10, 2023, 2:00 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవంతరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి వారు ప్రజలలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత ఫామ్ హౌస్ లో సందడి చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తుండగా.. గర్లదీన్నే మండలం కనంపల్లి వద్ద ఆగటం జరిగింది. దీంతో అల్లు అర్జున్ రాక తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే ఫోన్ చేసి తమ ఫామ్ హౌస్ కి స్వాగతం పలికారు.

సింగనమల ద్వీసభ్య కమిటీ సభ్యులు మంటిమడుగు కేశవరెడ్డి ఆహ్వానించడం జరిగింది. ఇదే సమయంలో కేశవరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ కి వచ్చిన బన్నీకి ప్రత్యేకమైన రాయలసీమ వంటకాలు రుచి చూపించారు. అయితే ఊహించని విధంగా అల్లు అర్జున్ వచ్చినట్లు ఆ ప్రాంతంలో తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. దీంతో  తెలుగుదేశం పార్టీ నేతతో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు..ఫోటోలు..వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

what is the work of allu arjun with the leaders of telugu desam huge video is out

what is the work of allu arjun with the leaders of telugu desam huge video is out

ఇది పూర్తిగా కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం త్రివిక్రమ్.. బన్నీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కావడంతో పాటు బన్నీ భార్య స్నేహ రెడ్డికి వీలు బంధువులు అని అందువల్లే అల్లు అర్జున్ అటు వెళ్తూ వాళ్ళ పిలుపుమేరకు.. ఫామ్ హౌస్ కి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp