Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు నిరసన తెలుపుతున్నారు. వైసీపీ నేతలు తప్పించి ఏపీ వ్యాప్తంగా ప్రజలంతా బయటికి వచ్చారు. ముఖ్యంగా ఏపీ మహిళలు అయితే బయటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు నిప్పు లాంటి మనిషి. ఆయన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా జగన్ చేసే పనే. జగన్ ఇంత దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదు. ఇదంతా ఖచ్చితంగా జగన్ పనే. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు దేనికి పనికిరావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే అమలు అయ్యాయి. మద్యపాన నిషేధం చేయడం పక్కన పెట్టి కల్తీ మందు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడంటూ జగన్ పై ఏపీ మహిళలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అసలు చంద్రబాబు తప్పు చేశారా? అనేది పక్కన పెడితే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పేరే లేదు. ఆయన ఏ37. మరి మిగితా 36 మంది ఏరి. అసలు ఏ1 ఎవరు, ఏ2 ఎవరు.. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఏ37గా ఉన్న వ్యక్తిని ముందు ఎందుకు అరెస్ట్ చేశారు. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారో కనీసం చెప్పారా? ఆ స్కామ్ లో ఉన్న అసలు నిందితులను వదిలేసి జగన్.. కేవలం చంద్రబాబునే ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ మహిళలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Chandrababu Arrest : చంద్రబాబుది అవినీతి చేసే మనస్తత్వం అయితే హైదరాబాద్ లో ఐటీ వాళ్లు ఎందుకు వస్తారు?
నిజంగానే చంద్రబాబుది అవినీతి చేసే మనస్తత్వం అయితే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఎందుకు బయటికి వచ్చి నిరసన తెలుపుతారు. ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా జైలులో ఉన్నాడు కదా. ఆయన జైలులో ఉన్నప్పుడు ఎవ్వరైనా బయటికి వచ్చారా? నిరసన తెలిపారా? అది చంద్రబాబు గారికి, జగన్ కు ఉన్న తేడా అంటూ చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మహిళలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మహిళలు మండిపడ్డారు. మరోవైపు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుగుతోంది.