YS Jagan : కుప్పంలో కుంభస్థలం బద్దలు కొట్టే మొనగాడిని రంగంలోకి దింపిన జగన్.. చంద్రబాబుకి చాప్టర్ క్లోజ్?
YS Jagan : ఏపీలోనే ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టి.. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ రెండూ కుప్పం మీదనే దృష్టి పెట్టాయి. కుప్పం అనేది ఒక నియోజకవర్గం మాత్రమే కానీ.. దానిపైనే రెండు పార్టీలు తెగ ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం. అది టీడీపీకి కంచుకోట. కానీ.. ఈసారి దాన్ని కూడా పడగొట్టి అక్కడ వైసీపీ జెండా పాతాలనేది సీఎం జగన్ డ్రీమ్. దాని కోసం..కుప్పంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు సీఎం జగన్.
అందుకే ఇప్పుడు ఆ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాలనే తన వైపునకు తిప్పుకుంటోంది. టీడీపీకి, చంద్రబాబుకు కంచుకోటలా ఉన్న ఈ కుప్పం నియోజకవర్గం ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో నుంచి చేజారబోతోంది. ఎప్పుడైతే సీఎం జగన్ కుప్పంలో పర్యటించారో అప్పటి నుంచి అసలు కుప్పంలో రాజకీయాలే మారిపోయాయి. సీఎం జగన్ పర్యటనకు ముందే చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేశ్ కుప్పంలో పర్యటించి ఓ మూడునాలుగు రోజులు అక్కడే ఉన్నారు.
YS Jagan : కుప్పం కింగ్ ఎవరు?
సీఎం జగన్ పర్యటించినా.. అక్కడ గెలిచేది చంద్రబాబే అని టీడీపీ నేతలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబే కుప్పంలో కింగ్ అవుతారని జోస్యం చెబుతున్నా.. అసలు వాస్తవ పరిస్థితులు వేరు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు 2024 లో కుప్పంలో ఎగరబోయేది వైసీపీ జెండానే అని ఖరాఖండిగా చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇలా ఒకరికి మరొకరు సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో అసలు కుప్పం ఎవరి సొంతం కాబోతోంది అనే దానిపై ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైసీపీ నేతలకు ఇంత ఆత్మవిశ్వాసాన్ని కుప్పం ఇవ్వడానికి మరో కారణం కుప్పంలో పెద్ద ఎత్తున నేతలు వైసీపీలో చేరడం. టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, అభిమానులు వైసీపీలో చేరారు. సీఎం జగన్ పాలనను చూసి, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నేతలు వైసీపీలో చేరుతున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అందుకే.. కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం అని చెబుతున్నారు.