Jagan – Chandrababu : జగన్ – చంద్రబాబు ఒకే సారి ముస్లిం మత పెద్దలని కలవడానికి కారణం ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jagan – Chandrababu : జగన్ – చంద్రబాబు ఒకే సారి ముస్లిం మత పెద్దలని కలవడానికి కారణం ఏంటి ?

Jagan – Chandrababu : ప్రస్తుతం ఏపీలో విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ.. రెండు పార్టీల నేతల ఫోకస్ ఒకచోటు మీదికే మారింది. అదే.. ముస్లింలు. అవును.. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు వీళ్లు ఏంటి.. ముస్లిం మత పెద్దల మీద పడ్డారు. వాళ్లతో అంత అవసరం ఏమొచ్చింది అంటూ ఏపీ జనాలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 July 2023,7:00 pm

Jagan – Chandrababu : ప్రస్తుతం ఏపీలో విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ.. రెండు పార్టీల నేతల ఫోకస్ ఒకచోటు మీదికే మారింది. అదే.. ముస్లింలు. అవును.. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు వీళ్లు ఏంటి.. ముస్లిం మత పెద్దల మీద పడ్డారు. వాళ్లతో అంత అవసరం ఏమొచ్చింది అంటూ ఏపీ జనాలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి.. రాజకీయ నాయకులు ఎవరితో సమావేశం అయినా దాని వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు సమావేశం వెనుక, సీఎం జగన్ సమావేశం వెనుక ఏం కారణం ఉందో చెప్పాలంటే కష్టమే.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును పాస్ చేయించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. కానీ. ఈ బిల్లుపై ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నారు. బీజేపీ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఏపీలో కూడా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ కూడా బీజేపీకి మద్దతుగానే ఉంది.ఒకవేళ కేంద్రం తెచ్చే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చినా.. టీడీపీ మద్దతు ఇచ్చినా ముస్లిం ఓట్లకు గండి పడినట్టే. ముస్లింలు ఖచ్చితంగా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలను వ్యతిరేకిస్తారు.

chandrababu and Ys Jagan

chandrababu and Ys Jagan

Jagan – Chandrababu : బిల్లుకు మద్దతు ఇస్తే ఏపీలో ముస్లిం ఓట్లకు గండి కొట్టినట్టే?

అందుకే ఇప్పటి నుంచే ముస్లిం ప్రతినిధులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి రెండు పార్టీలు. నిజానికి.. ఈ రెండు పార్టీలు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సుముఖత చూపించడం లేదు కానీ.. ఒకవేళ ఎక్కడ ముస్లింలు తమ పార్టీలను తప్పుగా అర్థం చేసుకుంటారో అని.. ఇప్పటి నుంచే వాళ్లకు క్లారిటీ ఇవ్వడం కోసం చేసే ప్రయత్నాలే ఇవన్నీ అని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది