YS Sunitha : చాలా పెద్ద తప్పు చేసిన వైఎస్ సునీత.. దేవుడు కూడా కాపాడలేడు..!
YS Sunitha : దేవుడా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎటువైపు మలుపులు తిరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. ఇప్పటి వరకు ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఏపీ ప్రజలకు అయితే ఎవరు నిందితులో.. ఎవరు నిందితులు కాదో కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే కొందరిని సీబీఐ అరెస్ట్ చేసింది. మరికొందరిని విచారించింది.ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది సీబీఐ. ఇప్పటికే ఆయన్ను పలుమార్లు విచారించింది.
కోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆయన్ను అరెస్ట్ చేసే సూచనలు అయితే లేవు. అయితే.. అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీబీఐని వెంటనే ఆదేశించాలని.. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ కూడా ఇటీవలే పూర్తయింది.అయితే.. వైఎస్ సునీతే స్వయంగా తన తరుపు వాదనలు వినిపించింది. దీంతో ఆమెను న్యాయమూర్తి కూడా హెచ్చరించాల్సి వచ్చింది. ఎందుకంటే.. న్యాయశాస్త్రం గురించి అంతగా అవగాహన లేకుండా.. తొందరపడి వాదిస్తే మీరే నష్టపోతారు అంటూ న్యాయమూర్తి హెచ్చరించారు.
YS Sunitha : తన తరుపు వాదనలు వినిపించిన సునీత
వివేకానంద హత్య విషయం.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు ముందే తెలుసు అంటూ సునీత సుప్రీం ధర్మాసనానికి విన్నవించినట్టు తెలుస్తోంది. అలాగే.. బెయిల్ కూడా రద్దు చేయాలని చాలానే వాదించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పిటిషన్ లో సీబీఐని యాడ్ చేయాలని ఆమె కోరారు. కానీ.. సునీత రిక్వెస్టులను కోర్టు ఒప్పుకోలేదు. మళ్లీ జూన్ 19వ తారీఖుకు విచారణను వాయిదా వేసింది. అసలు.. సునీత ఇన్ని రోజులు ఏం మాట్లాడుకుండా సడెన్ గా ఇప్పుడు కడప ఎంపీ, సీఎం జగన్ మీద ఇలా సుప్రీంలో వ్యతిరేక వాదనలు వినిపించడంపై ఏపీ ప్రజలు తలో మాట అనుకుంటున్నారు. చూద్దాం మరి.. సునీత నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందో?