Babu Mohan : బీజేపీకి బిగ్ షాక్… హస్తం గూటికి బాబు మోహన్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Babu Mohan : బీజేపీకి బిగ్ షాక్… హస్తం గూటికి బాబు మోహన్?

Babu Mohan : బీజేపీ పార్టీపై బాబు మోహన్ అలక చెందారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు ఓవైపు తెలంగాణ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకుంటే.. బాబు మోహన్ మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. బీజేపీ హైకమాండ్ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెంది పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. నిజంగానే బాబు మోహన్ కు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే ఆసక్తి కూడా లేనట్టుగా తెలుస్తోంది. బాబు మోహన్ పార్టీ మారాలని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :30 October 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  రెండు జాబితాల్లోనూ లేని బాబు మోహన్ పేరు

  •  కావాలని బాబు మోహన్ ను బీజేపీ హైకమాండ్ దూరం పెడుతోందా?

  •  ఈసారి బాబు మోహన్ కు టికెట్ దక్కేనా?

Babu Mohan : బీజేపీ పార్టీపై బాబు మోహన్ అలక చెందారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు ఓవైపు తెలంగాణ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకుంటే.. బాబు మోహన్ మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. బీజేపీ హైకమాండ్ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెంది పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. నిజంగానే బాబు మోహన్ కు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే ఆసక్తి కూడా లేనట్టుగా తెలుస్తోంది. బాబు మోహన్ పార్టీ మారాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు పార్టీ తనను పట్టించుకోకుండా ఉంటే.. తాను మాత్రం ఎందుకు పార్టీలో ఉండాలని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. అందుకే బీజేపీపై బాబు మోహన్ అలక చెందినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. బీజేపీ పార్టీ ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాలలో తన పేరు లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ పై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని.. ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉండాలని భావించినట్టు తెలుస్తోంది. నా కొడుకుకు టికెట్ అంటూ కుటుంబంలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తోందని బాబు మోహన్ స్పష్టం చేశారు. నా కొడుకుకి టికెట్ ఇచ్చినా దాపరికం ఎందుకు, ఆ విషయం నాకు చెప్పాలి కదా అని బీజేపీ అధిష్ఠానాన్ని విమర్శించారు. వరుస జాబితాల పేరుతో దాపరికం నాకు నచ్చడం లేదు. బీజేపీలో కొందరు బడా నేతలు కావాలని నన్ను పక్కన పెడుతున్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. అలాంటి నన్ను ఎన్నో జాబితాలో పెడతారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి ఈసారి దూరంగా ఉండాలని నేను అనుకుంటున్నాను.. అంటూ బాబుమోహన్ తన సన్నిహితులకు చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది.

Babu Mohan : నేను ఫోన్ చేసినా వాళ్లు లిఫ్ట్ చేయడం లేదు

నేను ఫోన్ చేసినా కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్.. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అధిష్ఠానం స్పందన బట్టే నా నిర్ణయం ఉంటుంది. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి బీజేపీలో ఉండాలా లేక రాజీనామా చేయాలా అనేది నిర్ణయించుకుంటా అంటూ బాబు మోహన్ అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బాబుమోహన్ బీజేపీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుండటంతో బాబు మోహన్ హస్తం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది