Babu Mohan : బీజేపీ పార్టీపై బాబు మోహన్ అలక చెందారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు ఓవైపు తెలంగాణ ఎన్నికల వేడి రాష్ట్రంలో రాజుకుంటే.. బాబు మోహన్ మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. బీజేపీ హైకమాండ్ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెంది పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. నిజంగానే బాబు మోహన్ కు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే ఆసక్తి కూడా లేనట్టుగా తెలుస్తోంది. బాబు మోహన్ పార్టీ మారాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు పార్టీ తనను పట్టించుకోకుండా ఉంటే.. తాను మాత్రం ఎందుకు పార్టీలో ఉండాలని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. అందుకే బీజేపీపై బాబు మోహన్ అలక చెందినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. బీజేపీ పార్టీ ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాలలో తన పేరు లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ పై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని.. ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉండాలని భావించినట్టు తెలుస్తోంది. నా కొడుకుకు టికెట్ అంటూ కుటుంబంలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తోందని బాబు మోహన్ స్పష్టం చేశారు. నా కొడుకుకి టికెట్ ఇచ్చినా దాపరికం ఎందుకు, ఆ విషయం నాకు చెప్పాలి కదా అని బీజేపీ అధిష్ఠానాన్ని విమర్శించారు. వరుస జాబితాల పేరుతో దాపరికం నాకు నచ్చడం లేదు. బీజేపీలో కొందరు బడా నేతలు కావాలని నన్ను పక్కన పెడుతున్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. అలాంటి నన్ను ఎన్నో జాబితాలో పెడతారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి ఈసారి దూరంగా ఉండాలని నేను అనుకుంటున్నాను.. అంటూ బాబుమోహన్ తన సన్నిహితులకు చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది.
నేను ఫోన్ చేసినా కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్.. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అధిష్ఠానం స్పందన బట్టే నా నిర్ణయం ఉంటుంది. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి బీజేపీలో ఉండాలా లేక రాజీనామా చేయాలా అనేది నిర్ణయించుకుంటా అంటూ బాబు మోహన్ అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బాబుమోహన్ బీజేపీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుండటంతో బాబు మోహన్ హస్తం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.