
ys sharmila to file nominations for paleru constituency on november 4
YS Sharmila : తెలంగాణ రాజకీయాల్లో పాలేరు రాజకీయాలు వేరు. పాలేరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పడింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్.. ఇప్పుడు వైఎస్సార్టీపీ నుంచి వైఎస్ షర్మిల పోటీ దిగుతుండటంతో.. అధికార పార్టీని ఢీకొని షర్మిల అక్కడ నిలదొక్కుకోగలదా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే.. షర్మిల ఈసారి పాలేరు నుంచి బరిలో దిగడం లేదని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. షర్మిల పాలేరు నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్, నామినేషన్స్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. నవంబర్ 4న షర్మిల పాలేరు నియోజకవర్గం కోసం నామినేషన్ వేయనున్నారు. నవంబర్ 1 నుంచే ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతున్నా… తనను కాంగ్రెస్ లోకి రావాలని హైకమాండ్ రిక్వెస్ట్ చేసినా కొన్ని పరిస్థితులు అనుకూలించక షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయలేదు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తోనూ తన పార్టీని విలీనం చేసే ప్రక్రియ గురించి చర్చించినా వర్కవుట్ కాలేదు. మరోవైపు పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావడంతో.. అతడితో సై అంటే సై అనబోతోంది షర్మిల. వైఎస్సార్టీపీ పార్టీకి తెలంగాణలో అంత బలం లేకున్నా.. పాలేరులో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే వైఎస్సార్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా.. పాలేరు నుంచి పొంగులేటి గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇటు షర్మిల కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో పాలేరులో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో పాలేరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.