Congress : సర్వే ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లోకి డీకే అరుణ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress : సర్వే ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లోకి డీకే అరుణ?   

 Authored By kranthi | The Telugu News | Updated on :16 October 2023,7:00 pm

Congress : డీకే అరుణ.. గద్వాల రాజకీయాల్లో తనకంటూ ఒక బలాన్ని సంపాదించుకున్నారు డీకే అరుణ. తనకంటూ అక్కడ ఇప్పటికీ బలగం ఉంది. అందుకే డీకే అరుణ రాజకీయాల్లో ఇప్పటికీ రాణిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఆమె మంత్రిగానూ పని చేశారు. కానీ.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరారు. బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని కీలక బీజేపీ నేతల్లో ఒకరిగా ఆమె ఉన్నారు. తను ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కానీ.. అసలు బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యత లభిస్తున్నదా అంటే లేదనే చెప్పుకోవాలి. బీజేపీలో తను ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై బీజేపీ అధిష్ఠానం కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉందని భావించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. డీకే అరుణకు ఇప్పటి వరకు బీజేపీ ఎలాంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తారా? లేక ఎంపీగా పోటీ చేయిస్తారా అనే దానిపై క్లారిటీ రాలేదు. లేదంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తారా అనేది కూడా తెలియడం లేదు. మరోవైపు సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా ఏం చేయాలో డీకే అరుణకు తోచడం లేదు. అందుకే కాంగ్రెస్ లో చేరి గద్వాల నుంచి పోటీ చేస్తే తను మళ్లీ గెలిచి తన సత్తా చాటొచ్చు అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తను కాంగ్రెస్ లో చేరి గద్వాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ నుంచి తనకు గద్వాల నుంచి టికెట్ లభిస్తుందా? అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

will dk aruna to join in congress party

#image_title

Congress : బీజేపీలో కొనసాగుతారా? లేక కాంగ్రెస్ లోకి వస్తారా?

అయితే.. డీకే అరుణ కాంగ్రెస్ లోకి వస్తారా? లేక బీజేపీలోనే కొనసాగుతారా? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఏది ఏమైనా బీజేపీలో మంచి అవకాశాలు వస్తే పర్లేదు కానీ.. బీజేపీలో మంచి అవకాశాలు రాకపోతే.. కనీసం కాంగ్రెస్ లో చేరి అయినా తను గెలిచే అవకాశాలు ఉన్నాయి. సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు ఉండటంతో త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది