Tirumala Laddu : అటు వైసీపీ, ఇటు జనసేన.. చంద్రబాబు వల్ల కష్టాల్లో పడ్డారు..!
ప్రధానాంశాలు:
Tirumala Laddu : అటు వైసీపీ, ఇటు జనసేన.. చంద్రబాబు వల్ల కష్టాల్లో పడ్డారు..!
Tirumala Laddu : ఏపీలో తిరుమల లడ్డూకి వాడే నెయ్యి కల్తీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్న నాటి నుంచి వ్యవహారం నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఆయన మాట అనేసి ఊరుకుని అడపాదడపా అవసరమైతే తప్ప స్పందించ లేదు. కానీ ఈ మ్యాటర్ లో చంద్రబాబు కంటే ఎక్కువగా కూటమి భాగస్వామి లో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందన్ సంచలనంగా మారింది. ఆయన ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరో పక్క జగన్ ని కూడా ఈ విషయం చాలా ఇబ్బందులో నెట్టేసింది. సో బాబు చేసిన కామెంట్స్ వైసీపీ, జనసేన రిస్క్ లో పడేలా చేశాయి.
తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చ్న చంద్రబాబు క్యాడర్ కు మాత్రం భారీ ఆందోళన చేసేలా ఎలాంటి పిలుపూ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రెచ్చిపోయారు. జగన్ కూడా తమ క్యాడర్ ను దించి క్షేత్రస్ధాయిలో ఆందోళనలు చేస్తున్నాడు. ఆలయాల్లో ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో తన ద్వారా సనాతన ధర్మం బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. మరోపక్క కూటమి వ్యూహాల్ని రివర్స్ కౌంటర్ చేసేందుకు జగన్ వైసీపీ నేతల్ని సిద్ధం చేశాడు.
Tirumala Laddu నాలుగు నెలల్లోనే ఇలాంటి వివాదం..
ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎలక్షన్స్ లేవు. ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోనే ఇలాంటి వివాదం జరగడం పెను సంచలనంగా మారింది. చంద్రబాబు చేసిన లడ్డూ వివాదంలో జనసేన వైసీపీ నేతలకే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అసలు టీడీపీ ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరిని కార్నర్ చేసి చంద్రబాబు సైలెంట్ అయ్యరని అంటున్నారు.
రాష్ట్రంలో ఎలాంటి ఎలక్షన్స్ లేకపోయినా బాబు తమ పార్టీ నేతలను సైలెంట్ గా ఉంచడం ఆశ్చర్యకరంగా ఉంది. టీడీపీపై వైసీపీ, జనసేన ఫోకస్ లేకుండా తిరుమల లడ్డూ విషయంలో మాటల యుద్ధం చేసుకునేలా చేశారు. ఐతే రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల తొలి దశ ప్రకటన తర్వాత పార్టీలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. అందుకే చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరి