YS Jagan : వాళ్ళ ముగ్గురు నీ సస్పెండ్ చేసి పారేయండి.. స్పాట్ లో.. జగన్ సీరియస్ ఆదేశాలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan :  వాళ్ళ ముగ్గురు నీ సస్పెండ్ చేసి పారేయండి.. స్పాట్ లో.. జగన్ సీరియస్ ఆదేశాలు?

YS Jagan : ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. నెల్లూరు రాజకీయాలు మరో ఎత్తు. నెల్లూరు కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే మళ్లుతోంది. నిజానికి నెల్లూరులో కంచుకోట అయిన వైసీపీని దెబ్బ తీయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. వైసీపీ వాళ్లను సస్పెండ్ చేసింది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 June 2023,12:00 pm

YS Jagan : ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. నెల్లూరు రాజకీయాలు మరో ఎత్తు. నెల్లూరు కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే మళ్లుతోంది. నిజానికి నెల్లూరులో కంచుకోట అయిన వైసీపీని దెబ్బ తీయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. వైసీపీ వాళ్లను సస్పెండ్ చేసింది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి.

నెల్లూరులో లోకేశ్ యాత్ర ప్రారంభం కావడంతో వాళ్లంతా టీడీపీ యువనేత యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు.. అనర్హత వేయాలి అంటున్నారు. లేదా వాళ్లు రాజీనామా చేసి టీడీపీలో చేరాలి అనే డిమాండ్లు మొదలయ్యాయి. మరి.. వైసీపీ ఏం చేస్తుంది. వాళ్లపై అనర్హత వేటు వేస్తుందా? లేక వాళ్లంతట వాళ్లే రాజీనామా చేస్తారా అనేది అంతుపట్టడం లేదు.నిజానికి.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగానే టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

ycp suspended mlas to join in tdp soon

ycp suspended mlas to join in tdp soon

YS Jagan : అధికారికంగానే టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్

అక్కడ పార్టీలోకి రావాలంటూ వాళ్లను ఆహ్వానించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా నారా లోకేశ్ ను కలిసి పాదయాత్రకు తన సంఘీభావం ప్రకటించారు. ముగ్గురు నేతలు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయాలని తెగ ఆరాట పడుతున్నారు. అంతేకాదు.. ఆయన పాదయాత్ర పూర్తవగానే టీడీపీలో చేరేందుకు వాళ్లు సుముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి వాళ్లు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలే. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ.. నైతికంగా వాళ్లు వైసీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో వాళ్లు తమ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా లోకేష్ పాదయాత్రలో పాల్గొంటే వైసీపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది